ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మల్లన్న స్పర్శదర్శనంపై కీలక నిర్ణయం తీసుకుంది దేవస్థానం.. శ్రీశైలంలో ఇకపై భక్తుల రద్దీ రోజుల్లోనూ స్పర్శ దర్శనం కల్పించనున్నట్టు వెల్లడించారు నూతన ఈవో ఎం.శ్రీనివాసరావు.. అయితే, శని, ఆది, సోమవారాలు పర్వదినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా స్పర్శదర్శనాలు, అభిషేకాలు నిలివేస్తూ గతంలో దేవస్థానం ప్రకటించిన విషయం విదితమే కాగా.. భక్తుల విజ్ఞప్తి మేరకు దేవస్థానం వైదిక కమిటీ, అధికారులతో చర్చించి స్పర్శ దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు…
Karthika Somavaaram:ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ శైవక్షేత్రాలన్నీ శివనామంతో మారుమోగుతున్నాయి.
రాబోయే రోజుల్లో రెండు, మూడు విమానాలు వచ్చే అవకాశం ఉందన్నారు సీఎం చంద్రబాబు.. పచ్చదనం, జలాల మధ్య శ్రీశైలంలో సీ ప్లేన్ చాలా అందంగా ఉందన్న ఆయన.. భారత్ లో మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నాం అన్నారు.. అయితే, సీ ప్లేన్, బోట్లు, రోడ్డు రవాణాను లింక్ చేస్తేబాగుంటుందన్నారు సీఎం
శ్రీశైలం ప్రాజెక్టు పాతాళగంగలో సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది.. ట్రయల్ రన్ లో భాగంగా సేఫ్ గా నీటిపై ల్యాండ్ అయ్యింది సీ ప్లేన్.. ఇక, సీ ప్లేన్ ట్రయల్ రన్ ని దగ్గరుండి పరిశీలించారు నంద్యాల జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు.. కాగా, రేపు విజయవాడలో సీ ప్లేన్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో తొలి సీప్లేన్ సర్వీసులకు వేదికకా మారనుంది విజయవాడ.. ఇప్పటికే డీ హావిలాండ్ ట్విన్ అట్టర్ క్లాసిక్ 300 విమానం భారత్‌కు చేరుకోగా... నేడు శ్రీశైలం నుంచి విజయవాడ వరకు సీ ప్లేన్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు..
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 9న ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. శ్రీశైలం పాతాళగంగలోని కృష్ణానది , బెజవాడ ప్రకాశం బ్యారేజీ ల్యాండింగ్ పాయింట్లుగా సీ ప్లేన్ సర్వీసును లాంఛనంగా ప్రారంభించనున్నారు.
శ్రీశైలంలో కార్తీకమాస మొదటి సోమవారం మల్లన్నకు ప్రీతికరమైన రోజు.. దీంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది.. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైలం మల్లికార్జునస్వామి క్షేత్రంలో కార్తీక మసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.. నేటి నుండి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కాగా.. డిసెంబర్ 1 వతేదీ వరకు జరగనున్నాయి.. కార్తీక మసోత్సవాల ప్రారంభంలో భాగంగా వేకువజామనే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ ముందు ఉన్న గంగాధర మండపం వద్ద అలానే క్షేత్రంలో పలు చోట్ల కార్తీక దీపాలు వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు.. అనంతరం శ్రీస్వామి అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్స్ క్యూ కంపార్టుమెంట్ లలో ఓం:నమశ్శివాయ…
Nagarjuna Sagar to Srisailam Tour: కృష్ణా నదిలో జల విహారానికి తెలంగాణ పర్యాటక శాఖ సిద్ధమైంది. ఈ మేరకు ప్రయాణికుల కోసం టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు.
కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతుంది.. వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలోని కృష్ణాబేసిన్లోని అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు... జూరాలకు వరద కొనసాగుతుండగా.. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో 71,713 వేల క్యూ సెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 76,667 క్యూ సెక్కులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 1045 ఫీట్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1043.865 ఫీట్లుగా ఉంది.. జూరాల పూర్తి నీటి…