Srisailam Temple: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మల్లన్న స్పర్శదర్శనంపై కీలక నిర్ణయం తీసుకుంది దేవస్థానం.. ఇప్పుడు స్పర్శదర్శనంలో మార్పులు చేసింది.. శ్రీశైలంలో రద్దీ రోజులలో మల్లన్న స్పర్శదర్శనంలో మార్పులు చేస్తూ నిర్ణయించింది.. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ స్పర్శదర్శనంలో మార్పులు చేసింది దేవస్థానం.. ఇక, మీదట ప్రతి శనివారం, ఆదివారం, సోమవారం ప్రభుత్వ సెలవు రోజుల్లో రోజుకు 2 విడతలుగా మాత్రమే స్పర్శ దర్శనం కల్పించనున్నారు.. రద్దీ రోజుల్లో ప్రతి విడతకు 500 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంచనుంది దేవస్థానం.. ఈ సమయంలో ఉదయం 7:30 గంటలకు.. తిరిగి రాత్రి 9 గంటలకు మాత్రమే శ్రీస్వామివారి స్పర్శ దర్శనం కల్పించనున్నారు..
Read Also: Second World War : హిరోషిమా, నాగసాకిలపై అమెరికా ఆటమ్ బాంబు వేయడానికి కారణమేంటి..?
అయితే, శ్రీశైలంలో ఇకపై భక్తుల రద్దీ రోజుల్లోనూ స్పర్శ దర్శనం కల్పించనున్నట్టు ఆ మధ్యే ఈవో ఎం.శ్రీనివాసరావు ప్రకటించిన విషయం విదితమే.. శని, ఆది, సోమవారాలు పర్వదినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా స్పర్శదర్శనాలు, అభిషేకాలు నిలివేస్తూ గతంలో దేవస్థానం ప్రకటించిన విషయం విదితమే కాగా.. భక్తుల విజ్ఞప్తి మేరకు దేవస్థానం వైదిక కమిటీ, అధికారులతో చర్చించి స్పర్శ దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు ఈవో శ్రీనివాసరావు.. ఇక, రద్దీ రోజుల్లో 4 విడతలు అలంకార దర్శనం, 3 విడతలు స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించారు ఈవో శ్రీనివాసరావు.. ఇకపై శని, ఆది, సోమవారంతో పాటు.. సెలవు రోజుల్లో కూడా స్పర్శ దర్శనానికి అవకాశం ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు.. అయితే, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తుల అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో.. తాజాగా స్పర్ష దర్శనాల్లో మార్పులు చేసింది శ్రీశైలం దేవస్థానం..