CM Chandrababu on seaplane: సీ ప్లేన్, బోట్లు, రోడ్డు రవాణా లింక్ చేయాలి.. అధికారులతో సీఎం..
- సీ ప్లేన్ లో విజయవాడ నుంచి శ్రీశైలంకు సీఎం..
- రాబోయే రోజుల్లో రెండు మూడు విమానాలు వచ్చే అవకాశం..
- పచ్చదనం.. జలాల మధ్య శ్రీశైలంలో సీ ప్లేన్ చాలా అందంగా ఉంది..
- సీ ప్లేన్.. బోట్లు.. రోడ్డు రవాణాను లింక్ చేస్తేబాగుంటుందన్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu on seaplane: విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్ సేవలను లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు.. మరికొందరు ప్రజాప్రతినిధులు.. అధికారులతో కలిసి సీ ప్లేన్‌లో విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లారు.. అయితే, సీప్లేన్ పై అధికారులు, ప్రజా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడారు సీఎం చంద్రబాబు.. రాబోయే రోజుల్లో రెండు, మూడు విమానాలు వచ్చే అవకాశం ఉందన్నారు.. పచ్చదనం, జలాల మధ్య శ్రీశైలంలో సీ ప్లేన్ చాలా అందంగా ఉందన్న ఆయన.. భారత్ లో మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నాం అన్నారు.. అయితే, సీ ప్లేన్, బోట్లు, రోడ్డు రవాణాను లింక్ చేస్తేబాగుంటుందన్నారు సీఎం చంద్రబాబు..
Read Also: CM Revanth Reddy: ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం..
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
శ్రీశైలంలో ఎంత భూమి అందుబాటులో ఉందని వివరాలు తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.. అయితే, 5 వేల ఎకరాలు ఉందని సమాధానం చెప్పారు అధికారులు.. ఇక, శ్రీశైలం సీ ప్లేన్ దిగే ప్రాంతంలో ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తే పర్యాటకులకు బాగుంటుందని పేర్కొన్నారు.. రోప్ వే వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు.. అయితే, రోప్ వేలో 4 క్యాబిన్ లు వున్నాయని కలెక్టర్.. సీఎంకు వివరించారు.. పాతాళ గంగ మట్టి రోడ్డు వివరాలను కూడా అడిగిన తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.. ఇక, విజయవాడ నుంచి సీ ప్లేన్‌లో శ్రీశైలం చేరుకున్న ఆయన.. రోప్ వేలో పాతాళ గంగ నుంచి శ్రీశైలం చేరుకున్నారు.. ఇక, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత.. తిరిగి విజయవాడకు సీ ప్లేన్‌లో వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!