భక్తుల దర్శనాలపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2 నుండి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో కార్తీక శని, ఆది,సోమ,పౌర్ణమి,ఏకాదశి రోజులలో సామూహిక,గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలను శ్రీశైలం దేవస్థానం రద్దు చేసింది.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం ఈవో డి.పెద్దిరాజును బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెద్దిరాజును తన మాతృ సంస్థకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. ఏడో రోజు ఉత్సవాల్లో భాగంగా నేడు సాయంత్రం కాళరాత్రి అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. ఇక, గజవాహనంపై ప్రత్యేక పూజలు అందుకోనున్నారు ఆది దంపతులు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు.. మరోరోజు ఆరో రోజు శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా సాగాయి..
శ్రీశైలం జలాశయంపై ప్రపంచ బ్యాంక్, డ్యామ్ పేఫ్టీ, సీడబ్ల్యూసీ అధికారుల పరిశీలన ముగిసింది.. యాంటీ జలాస్కి ప్రపంచ బ్యాంక్ టెక్నికల్ ఎక్స్పర్ట్ వారితో పాటు ముక్కల రమేష్, రాజగోపాల్, సీడబ్ల్యూసీ సేలం ఆధ్వర్యంలో నిన్న.. ఈరోజు రెండు రోజుల పాటు పరిశీలన జరిగాయి.. రెండు రోజులుగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు జలాశయం అధికారులతో కలిసి సమావేశమై జలాశయానికి సంబంధించిన ప్లాంజ్ ఫుల్, అప్రోచ్ రోడ్డు డ్యామ్ గేట్లు.. కొండ చర్యలకు సంబంధించిన వాటిని అధికారులతో కలిసి పరిశీలించి…
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఈ రోజు స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నారు.. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి నేడు స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నట్లు శ్రీశైలం దేవస్థానం అధికారులు వెల్లడించారు..
Srisailam EO: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో లడ్డూ తయారీకి గత 20 ఏళ్లుగా కర్నూలు విజయ డైరీ నెయ్యి వాడుతున్నామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. విజయ నెయ్యి 2022- 23లో 590 రూపాయలకి పెంచడంతో కమిషనర్ నిర్ణయంతో ఒక సంవత్సరం టెండర్ పిలిచాం అన్నారు.
జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జునస్వామి దేవస్థానం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.. శ్రీశైలం ఆలయం విస్తీర్ణం.. అలానే ఆలయంలోని నంది విగ్రహానికి.. ఆలయ నిర్వాహణకు ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు లండన్ సంస్థలో స్థానం లభించింది..
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఈనెల 29న బంగారు స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థానం ప్రకటించింది. దేవస్థానం వైదిక కమిటీ సూచనతో ప్రతీ మాసంలో శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణరథోత్సవం నిర్వహిస్తున్నారు.
ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో అర్ధరాత్రి ఎడతెరిపిలేని కుంభవృష్టి కురిసింది.. క్షేత్రం పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా 4 గంటల పాటు భారీ వర్షం పడింది.. వర్షం ధాటికి క్షేత్రంలోని కొత్తపేట, శ్రీగిరి కాలనీలో ఇళ్లలోకి చేరింది వర్షపు నీరు.. ఎగువన అటవీప్రాంతం నుండి నీరు ప్రవాహంలో బైక్లు కొట్టుకుపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.