Srisailam: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మల్లన్న స్పర్శదర్శనంపై కీలక నిర్ణయం తీసుకుంది దేవస్థానం.. శ్రీశైలంలో ఇకపై భక్తుల రద్దీ రోజుల్లోనూ స్పర్శ దర్శనం కల్పించనున్నట్టు వెల్లడించారు నూతన ఈవో ఎం.శ్రీనివాసరావు.. అయితే, శని, ఆది, సోమవారాలు పర్వదినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా స్పర్శదర్శనాలు, అభిషేకాలు నిలివేస్తూ గతంలో దేవస్థానం ప్రకటించిన విషయం విదితమే కాగా.. భక్తుల విజ్ఞప్తి మేరకు దేవస్థానం వైదిక కమిటీ, అధికారులతో చర్చించి స్పర్శ దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు ఈవో శ్రీనివాసరావు.. ఇక, రద్దీ రోజుల్లో 4 విడతలు అలంకార దర్శనం, 3 విడతలు స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించారు ఈవో శ్రీనివాసరావు.. ఇకపై శని, ఆది, సోమ వారంతో పాటు.. సెలవు రోజుల్లో కూడా స్పర్శ దర్శనానికి అవకాశం ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు.. ఇక, స్పర్ష దర్శనం కోసం.. గతంలో వలె టికెట్లను ఆన్‌లైన్ ద్వారానే పొందేలా ఏర్పాట్లు చేయనున్నారు శ్రీశైలం దేశస్థానం అధికారులు.. కాగా, మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ సాదారణంగా ఉండగా.. శని, ఆది, సోమవారాల్లో ఎక్కువగా ఉండే విషయం విదితమే.. ఇక, శివరాత్రి, ఉగాది ఉత్సవాలు, కార్తీక మాసోత్సవాలు.. ఇలా ప్రత్యేక సమయంలో.. భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీశైలం తరలి వచ్చే విషయం విదితమే..
Read Also: BJP: రాజ్యాంగంపై చర్చకు బీజేపీ సన్నాహాలు.. లోక్‌సభలో సమాధానం ఇవ్వనున్న ప్రధాని!