ఉగాది మహోత్సవాలు సమీపిస్తుండడంతో మల్లన్న ఆలయానికి కన్నడ భక్తజనం బారులు తీరారు. అయితే, ఉగాది మహోత్సవాలకు వారం ముందు నుంచే కన్నడ భక్తులు శ్రీశైలానికి తరలివచ్చారు. దానికి తోడు ఈనెల 26 వరకు మాత్రమే కన్నడ భక్తుల సౌకర్యార్థం దేవస్థానం మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనానికి అనుమతించారు.
శ్రీశైలం జలాశయంలో ఒకవైపు నీటిమట్టం వేగంగా పడిపోతుంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తుండగా.. కుడి విద్యుత్ కేంద్రంలో ఏపీ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసింది. రోజుకు ఒక టీఎంసీకి పైగానే విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తుండడంతో సమీప కాలంలోనే శ్రీశైలం డ్యామ్ లో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకోనుంది..
శ్రీశైలంలో ఈనెల 27వ తేదీ నుండి 31వ తేదీ వరకు అంటే ఐదు రోజులపాటు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఉగాది ఉత్సవాలకు పాదయాత్రగా వచ్చే కైలాశద్వారం వద్ద భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు పరిశీలించారు ఈవో శ్రీనివాసరావు.. కన్నడ భక్తులు సేదతిరే చలువ పందిళ్లు, స్వచ్ఛసేవ, అన్నదానలను పరిశీలించారు ఈవో.. మంచినీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ద పెట్టి.. పాదయాత్ర కన్నడ భక్తులకు నీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు..
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో పౌర్ణమి సందర్భంగా గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.. ఈవో శ్రీన్నవాసరవు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.. శ్రీసామి అమ్మవారి మహా మంగళహారతుల అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకిలో ఎక్కించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు..
Fake Darshan Tickets: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి వారి నకిలీ దర్శనం టికెట్లను అధిక రేట్లకు భక్తులకు అమ్మిన వారిపై దేవస్థానం సీఎస్ఓ మదుసూదన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్లు అమ్ముతున్న కేటుగాళ్లపై కేసు నమోదు చేశారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు దుర్మరణం పాలైన విషయం విదితమే. అయితే టన్నెల్లో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కీలక దశకు చేరింది.
KRMB : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన నీటి వివాదాలను పరిష్కరించేందుకు కృష్ణా నదీ నిర్వహణ మండలి (KRMB) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి పంపిణీ, వృధా కాకుండా సరైన వినియోగం, తాగునీటి ప్రాధాన్యత వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాగునీటికి ప్రాధాన్యం – రెండురాష్ట్రాలకు బోర్డు సూచన KRMB రెండు రాష్ట్రాలకు తాగునీటి అవసరాలను అత్యంత ప్రాధాన్యతతో చూడాలని సూచించింది. ప్రజలకు తాగునీరు అందించడమే మొదటి బాధ్యతగా…
SLBC Tunnel Accident: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) టన్నెల్లో జరిగిన భయంకరమైన ప్రమాదం దేశవ్యాప్తంగా ఉత్కంఠ కలిగించింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల విషయంలో అధికారులు ఆశలు వదులుకుంటున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగి ఆరు రోజులు గడుస్తుండటంతో కార్మికులు ప్రాణాలతో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టన్నెల్లో భారీ ఎత్తున మట్టి కూలిపోవడం, నీరు, బురద చేరడంతో వారు బయటపడే అవకాశం మరింత తగ్గినట్లు అధికారులు భావిస్తున్నారు. కార్మికులు టన్నెల్ బోరింగ్ మెషీన్…
Uttam Kumar Reddy : శ్రీశైలం సమీపంలోని SLBC టన్నెల్లో ఘోర ప్రమాదం సంభవించి, ఎనిమిది మంది సిబ్బంది అందులో చిక్కుకుపోయారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజులు గడిచినా, కార్మికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వారి కోసం అధికారులు అన్ని విధాలుగా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. రక్షణ చర్యల్లో పురోగతి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే.. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అక్కడ పేరుకుపోయిన మట్టి నీరు…
శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదినం కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు.. సాయంకాలం శ్రీస్వామి అమ్మవార్లకు నందివాహనసేవ, ఆలయ ఉత్సవం నిర్వహించనున్నారు.. రాత్రి 10 గంటలకు లింగోద్బవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీస్వామివారికి పాగలంకరణ ఉండగా.. రాత్రి 12 గంటలకు పార్వతి పరమేశ్వరుల మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.