ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంను సందర్శించే భక్తులకు సెల్‌ఫోన్ సిగ్నల్స్ కష్టాలు తప్పడం లేదు. శనివారం (జూన్ 21) సాయంత్రం నుండి బీఎస్‌ఎన్‌ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) మినహ ఇతర సెల్‌ఫోన్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. సిగ్నల్స్ లేక ప్రముఖ టెలికాం సంస్థలైన ఎయిర్‌టెల్, జియో వినియోగదారులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. గత మూడు నెలలుగా ఎయిర్‌టెల్, జియో వినియోగదారులకు శ్రీశైలంలో సిగ్నల్స్ సమస్య ఎదురవుతోంది. భక్తులు ఎందరో ఫిర్యాదు చేసినా.. ఈ రెండు టెలికాం సంస్థలు మాత్రం చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.
Also Read: Murugan Devotees Meet: నేడు మధురైలో మురుగన్ భక్తుల సమ్మేళనం.. హాజరుకానున్న యోగి, పవన్ !
శ్రీశైలం స్థానికులు, భక్తులు చాలా మంది ఎయిర్‌టెల్, జియో నెట్‌వర్క్ వాడుతున్నారు. ఇక్కడ నిత్యం సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గత మూడు నెలలుగా వినియోగదారులకు శ్రీశైలంలో సిగ్నల్స్ సమస్య ఎదురవుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో శ్రీశైలంకు వచ్చిన భక్తులు సిగ్నల్స్ లేక.. తమ కుటుంబీకులు ఎక్కడ వున్నారో, ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఎయిర్‌టెల్, జియో సంస్థలు మెరుగైన సేవలు అందించాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.