Srisailam: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో బయటపడ్డ రాగి రేకుల్లో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి.. రాగి రేకుల్లో హాలీ తోకచుక్కకు సంబంధించిన శిలాశాసనం గుర్తించారు.. 1456లో విజయనగరరాజు మల్లికార్జున పాలనకు చెందిన సంస్కృత, దేవనాగరి లిపిలో ఈ శాసనం ఉందని అధికారులు తేల్చారు.. భారతదేశంలో మొదటిసారిగా 1456లో హాలీ తోకచుక్క భూమి మీదకు వస్తే సంభవించే విపత్తుపై ఈ శాసనం రాశారు.. హాలీ తోకచుక్క(ఉల్కా) విపత్తు సంభవించకుండా 1456 జూన్ 28న విజయనగర రాజు మల్లికార్జున శ్రీశైలంలో శాంతి పూజలు జరిపించినట్టుగా ఈ శాసనంలో పొందుపరిచారు.. ఏపీలోని కడప జిల్లా గాలివీడు మండలం కడియపులంక గ్రామం ఖగోళ శాస్త్ర రంగంలో ప్రావీణ్యం ఉన్న లింగ నార్య అనే పండితుడికి రాసిచ్చినట్లు శాసనం చెబుతోంది.. 1456లో విజయనగర రాజు మల్లికార్జున హాలీ తోకచుక్క విపత్తు గుర్తించి శాంతి పూజలు నిర్వహించారట.. 1456లో ప్రపంచ వ్యాప్తంగా హాలీ తోకచుక్క భయంకరమని ప్రచారం జరిగింది.. ఆ నేపథ్యంలోనే విజయనగర రాజు మల్లికార్జున శ్రీశైలంలో శాంతి పూజలు జరిపించి ఉంటారనే.. ఆ సమయంలోనే ఈ శాసనం వేసి ఉంటారని చెబుతున్నారు ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి..
Read Also: Mohanlal : మీరు మోహన్ లాల్ ఇంట్లో ఉండచ్చు.. ఎలానో తెలుసా?