Srisailam: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో పౌర్ణమి సందర్భంగా గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.. ఈవో శ్రీన్నవాసరవు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.. శ్రీసామి అమ్మవారి మహా మంగళహారతుల అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకిలో ఎక్కించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను ధర్మప్రచార రథంలో ఊరేగింపుగా గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని ఆలయ ఈవో శ్రీనివాసరావు, అర్చుకులు ప్రారంభించారు.. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆలయం రాజగోపురం నుంచి ప్రారంభమై.. గంగాధర మండపం, ఆంకాళమ్మ ఆలయం, నందిమండపం, గంగాసదనం, వీరభద్రస్వామి ఆలయం, పంచమఠాలు, మల్లన్న కన్నీరు పుష్కరిణి వద్దకు చేరుకుని తిరిగి నంది మండపం మీదుగా ఆలయ మహాద్వారం చేరుకోవడంతో శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమం ముగిసింది..
Read Also: Jaggareddy: హోలీ వేడుకల్లో డప్పు కొట్టి డ్యాన్స్ చేసిన జగ్గారెడ్డి
క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా దిరిగిప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.. ఈ గిరి ప్రదక్షిణలో వందలాది మంది భక్తులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.. గిరి ప్రదక్షిణ ముగిసిన అనంతరం అమ్మవారి ఆలయంలో వైశాఖ శుద్ధ పౌర్ణమి కావడంతో లక్షకుంకుమార్చన నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో భక్తులు పరోక్షసేవగా కూడా పాల్గొనే అవకాశం దేవస్థానం కల్పించడంతో.. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ నుంచి భక్తులు పాల్గొన్నారు.. ఈ లక్ష కుంకుమార్చనలో ముందుగా పూజాసంకల్పం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజను నిర్వహించి అర్చకులు, వేదపండితులు లక్షకుంకుమార్చన జరిపించారు.. ఈ పూజాకైకర్యాలతో ఆలయ ఈవో శ్రీనివాసరావు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.