శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట పేర్లను ప్రభుత్వం మార్చింది. కొత్త పేర్లను పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈగల పెంట ను కృష్ణ గిరి, దోమల పెంట ను బ్రహ్మగిరి గా మార్చుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు మార్చాలని అధికారులను ఆదేశించింది.
కృష్ణ, గోదావరి, పెన్నా , వంశధార నదులు ఉన్నాయి.. కృష్ణా నదికి నీళ్లు రాకపోయినా.. గోదావరి నుంచి బనకచర్ల ప్రాజెక్టుకు నీరు తెస్తే కరువు ఉండదు అని తేల్చి చెప్పారు. గోదావరి-బనకచర్ల నా సంకల్పం.. 554 టీఎంసీల నీళ్లు ఇప్పుడు నిలువ ఉన్నాయి.. రాబోయే రోజుల్లో 450 టీఎంసీల నీళ్లు వస్తే అన్ని జలాశయాలు కలకళలాడుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీశైలం వెళ్లనున్నారు. కృష్ణా నదికి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు.
శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త. ఈరోజు నుంచి మల్లన్న స్పర్శ దర్శనం తిరిగి ప్రారంభం కానుంది. సామాన్య భక్తులకు వారంలో 4 రోజులు ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని దేవస్థానం కమిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 నుంచి 3.34 గంటల వరకు భక్తులు స్వామిని తాకే అవకాశం ఉంది. స్పర్శ దర్శనం సమయంలో సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి అన్న విషయం గుర్తుంచుకోవాలి. Also Read: AP Liquor Scam: కాలమే…
శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో పంపిణీ చేసే లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి.. అయితే, లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందన్న ఆరోపణల వెనుక కుట్రకోణం ఉందంటున్నారు ఆలయ ఈవో శ్రీనివాసరావు.. దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలిపారు.. అంతేకాదు, శ్రీశైలం పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు.. దేవస్థానం సీసీ టీవీ ఫుటేజీ పరిశీలనతో ఆ కుట్రకోణం వెలుగులోకి వచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.. శ్రీశైలం దేవస్థానంపై దుష్ప్రచారం చేసేలా కుట్రకు పాల్పడ్డారని ప్రభుత్వానికి ఈవో నివేదిక ఇచ్చారు..
శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్ ఇచ్చారు అటవీ శాఖ అధికారులు. రేపటి నుంచి(జూలై 01 2025) ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శనను నిలిపివేశారు. రేపటి నుంచి సెప్టెంబర్ 31 2025 వరకు ఇష్టకామేశ్వరి ఆలయ యాత్రను నిలిపేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అటవీ శాఖ వారు భద్రతా కారణాలు, వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇష్టకామేశ్వరి ఆలయం శ్రీశైలం నల్లమల అడవులలో ఉంది. భక్తులు ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం కోసం ఈ…
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంను సందర్శించే భక్తులకు సెల్ఫోన్ సిగ్నల్స్ కష్టాలు తప్పడం లేదు. శనివారం (జూన్ 21) సాయంత్రం నుండి బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) మినహ ఇతర సెల్ఫోన్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. సిగ్నల్స్ లేక ప్రముఖ టెలికాం సంస్థలైన ఎయిర్టెల్, జియో వినియోగదారులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. గత మూడు నెలలుగా ఎయిర్టెల్, జియో వినియోగదారులకు శ్రీశైలంలో సిగ్నల్స్ సమస్య ఎదురవుతోంది. భక్తులు ఎందరో ఫిర్యాదు చేసినా.. ఈ రెండు టెలికాం సంస్థలు…
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో బయటపడ్డ రాగి రేకుల్లో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి.. రాగి రేకుల్లో హాలీ తోకచుక్కకు సంబంధించిన శిలాశాసనం గుర్తించారు.. 1456లో విజయనగరరాజు మల్లికార్జున పాలనకు చెందిన సంస్కృత, దేవనాగరి లిపిలో ఈ శాసనం ఉందని అధికారులు తేల్చారు
జ్యోతి మల్హోత్రాకు బెయిల్..? నేడు కోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది..! పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేశారనే ఆరోపణలతో సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు ఈరోజు (జూన్ 9న) తొలిసారి కోర్టులో విచారణకు రాబోతుంది. ఆమెను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరు చేయడం జరుగుతుంది. అయితే, గత విచారణలో, హిసార్ కోర్టు జ్యోతి మల్హోత్రాను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె హిసార్ సెంట్రల్ జైలులోనే…