శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.. నేటి నుంచి క్షేత్రంలో ఐదు రోజులపాటు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో అర్చకులు, ఈవో శ్రీనివాసరావు దంపతులు ఉగాది ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. బృంగివాహనంపై శ్రీస్వామి, అమ్మవారికి ఉంచి క్షేత్రపురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించనున్నారు.
READ MORE: Flight On Tirumala: మరోసారి తిరుమల శ్రీవారి గోపురంపై నుంచి వెళ్లిన విమానం.. టీటీడీ ఆగ్రహం
కాగా.. అమ్మవారిని తమ ఆడబిడ్డగా భావించి సేవించే కన్నడిగులు కర్ణాటక ప్రాంతం నుంచి శ్రీశైలానికి తరలివస్తున్నారు. దీంతో శ్రీగిరి సందడిగా మారింది. ఈనెల 27న స్వామివారి యాగశాల ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు.. 31న ముగుస్తాయి. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివస్తున్నారు. మంగళవారం నాటికే వేలాది మంది స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా బుధవారంతో స్పర్శ దర్శనం నిలిపివేసి.. గురువారం నుంచి అలంకరణ దర్శనం మాత్రమే కల్పించనున్నారు.
READ MORE: 10th Class Exams: పదో తరగతి పరీక్షా పత్రం లీక్.. ముగ్గురు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు!