ప్రముఖ శైవక్షేత్రమైన నంద్యాల జిల్లా శ్రీశైలంలో.. మల్లికార్జునస్వామిగా దర్శనం ఇస్తారు ఆ పరమేశ్వరుడు.. నిత్యం వేలాది మంది భక్తులు మల్లికార్జునస్వామి, భ్రమరాంబ మాత దర్శనానికి తరలివస్తుంటారు.. అయితే, శ్రీశైలం దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్నపై సస్పెన్షన్ వేటు వేసింది పాలకమండలి..
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో చోరీ కలకలం రేపుతోంది.. ఈ నెల 1వ తేదీన దర్శనం కోసం ఆలయానికి వచ్చిన స్థానికంగా నివసించే ఇద్దరు మైనర్ బాలురు.. ఆలయంలోని హుండీలో చోరీ పాల్పడ్డారు..
ఉగాది మహోత్సవాలు సమీపిస్తుండడంతో మల్లన్న ఆలయానికి కన్నడ భక్తజనం బారులు తీరారు. అయితే, ఉగాది మహోత్సవాలకు వారం ముందు నుంచే కన్నడ భక్తులు శ్రీశైలానికి తరలివచ్చారు. దానికి తోడు ఈనెల 26 వరకు మాత్రమే కన్నడ భక్తుల సౌకర్యార్థం దేవస్థానం మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనానికి అనుమతించారు.
శ్రీశైలంలో ఈనెల 27వ తేదీ నుండి 31వ తేదీ వరకు అంటే ఐదు రోజులపాటు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఉగాది ఉత్సవాలకు పాదయాత్రగా వచ్చే కైలాశద్వారం వద్ద భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు పరిశీలించారు ఈవో శ్రీనివాసరావు.. కన్నడ భక్తులు సేదతిరే చలువ పందిళ్లు, స్వచ్ఛసేవ, అన్నదానలను పరిశీలించారు ఈవో.. మంచినీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ద పెట్టి.. పాదయాత్ర కన్నడ భక్తులకు నీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు..
Fake Darshan Tickets: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి వారి నకిలీ దర్శనం టికెట్లను అధిక రేట్లకు భక్తులకు అమ్మిన వారిపై దేవస్థానం సీఎస్ఓ మదుసూదన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్లు అమ్ముతున్న కేటుగాళ్లపై కేసు నమోదు చేశారు.
మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణలతో మార్మోగుతున్నాయి. శివుడిని దర్శించుకునేందుకు తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాళేశ్వరం, వేములవాడ, కీసర తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేములవాడ రాజన్న క్షేత్రం భక్తుల శివనామస్మరణతో మార్మోగిపోతోంది. భక్తులు స్వామివారికి కోడె మొక్కలు చెల్లించి.. దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఆలయ అర్చకులు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.…
MLA Raja Singh : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసే కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. వైఎస్సార్ ప్రభుత్వం ఉన్న టైంలో కూడా చాలావరకు ముస్లింలకు శ్రీశైలం పుణ్యక్షేత్ర ప్రాంగణంలో అనేక షాప్ లు ఇచ్చారని, అప్పుడు హిందూ.. ఇతర సంఘాలు కోర్టుకు వెళ్ళారు.. స్టే కూడా తెచ్చుకున్నారన్నారు. నిన్న శివ స్వాములు ముస్లింలకు ఎందుకు షాప్ లు ఇచ్చారని ప్రశ్నిస్తే వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారన్నారు. మహా శివరాత్రికి…
శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్ల దందా కలకలం సృష్టించింది. వీఐపీ బ్రేక్ సమయంలో నకిలీ టికెట్లతో భక్తులను లోపలికి తీసుకెళ్తూ ఓ వ్యక్తి దొరికిపోయాడు. శ్రీశైల దేవస్థాన సిబ్బంది అనుమానం వచ్చి టికెట్లు తనిఖీ చేయగా.. నకిలీ టికెట్ల గుట్టు రట్టయింది. సదరు వ్యక్తిని ఆలయ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. శ్రీస్వామివారి స్పర్శ దర్శనం పాత టికెట్లను ఫోటోషాప్‌లో ఎడిట్ చేసి.. కొత్త టికెట్లు తరహాలో దందా చేస్తున్నట్లు గుర్తించారు. ఆధార్ కార్డులో పేర్లకు, టికెట్లలో…
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహిస్తుంటారు. ఏ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11 రోజులపాటు జరిగే ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో శ్రీనివాసరావు స్పందించారు. భక్తులు సంతృప్తికరమైన సమాధానం అనుభవాన్ని పంచుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. దర్శనం విషయంలో క్యూలైన్స్‌లో ఒత్తిడి లేకుండా.. ఏ లైన్ దేనికి అనేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అటవీశాఖ…
శ్రీశైలంలో రద్దీ రోజులలో మల్లన్న స్పర్శదర్శనంలో మార్పులు చేస్తూ నిర్ణయించింది.. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ స్పర్శదర్శనంలో మార్పులు చేసింది దేవస్థానం.. ఇక, మీదట ప్రతి శనివారం, ఆదివారం, సోమవారం ప్రభుత్వ సెలవు రోజుల్లో రోజుకు 2 విడతలుగా మాత్రమే స్పర్శ దర్శనం కల్పించనున్నారు.. రద్దీ రోజుల్లో ప్రతి విడతకు 500 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంచనుంది దేవస్థానం.. ఈ సమయంలో ఉదయం 7:30 గంటలకు.. తిరిగి రాత్రి 9 గంటలకు మాత్రమే శ్రీస్వామివారి స్పర్శ దర్శనం కల్పించనున్నారు..