జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జునస్వామి దేవస్థానం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.. శ్రీశైలం ఆలయం విస్తీర్ణం.. అలానే ఆలయంలోని నంది విగ్రహానికి.. ఆలయ నిర్వాహణకు ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు లండన్ సంస్థలో స్థానం లభించింది..
Srisailam Temple: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో భక్తులకు విభూదిధారణను ఆలయ ఈవో పెద్దిరాజు పునఃప్రారంభించారు. ఆలయ క్యూలైన్ వద్ద ఆలయంలోనికి ప్రవేశించే భక్తులకు అధికారులు విభూదిధారణ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో నాలుగోవ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు ఆలయ అధికారులు.. శ్రీశైలంలోని చంద్రవతి కళ్యాణ మండపంలో 5 వందల మంది చెంచు ముత్తైదువులు.. వేయి మంది సాధారణ మహిళలు.. ఉచితంగా ఈ వరలక్ష్మి వ్రతంలో పాల్గొని అవకాశం కల్పిస్తున్నారు..
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఈనెల 29న బంగారు స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థానం ప్రకటించింది. దేవస్థానం వైదిక కమిటీ సూచనతో ప్రతీ మాసంలో శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణరథోత్సవం నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.. నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాల పర్యటనలో భాగంగా మొదట శ్రీశైలం చేరుకున్న ఏపీ సీఎంకు.. సున్నిపెంటలోని హెలిప్యాడ్ దగ్గర మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.. ఆ తర్వాత రోడ్డు మార్గాన శ్రీశైలం మల్లన్న ఆలయనాకి చేరుకున్న సీఎం చంద్రబాబు..…
ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబిక అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్, మేఘా రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి శ్రీశైల మల్లికార్జున దర్శనం చేసుకున్నారు.