ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో జనవరి 1వ తేదీన శ్రీమల్లికార్జునస్వామి స్పర్శదర్శనాలు, ఆర్జిత అభిషేకాలను నిలిపివేశారు. జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా నిలుపుదల చేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. రద్దీ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సెలవులు, శని, ఆది, సోమ వారాల్లో అలంకార దర్శనం మాత్రమేనని ఆయన వెల్లడించారు.
గండికోట ప్రపంచంలో టాప్ 10 ప్రదేశాలలో ఒకటని.. 13వ శతాబ్దం లో నిర్మించారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గండికోటలో కోట సముదాయంలో రాజవంశాల వారసత్వాలు ఉన్నాయన్నారు. గండికోట లోఅడ్వంచెర్ గేమ్స్‌కి అవకాశాలు ఉన్నాయని.. గండికోట లో కూడా సీప్లేన్ ఆపరేషన్స్ ఉంటాయి.. ఇవాళే అక్కడ దిగాలనుకున్నామన్నారు. కేంద్రం సహకారంతో సీప్లేన్‌లు ఎక్కువ ప్రాంతాల్లో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని సీఎం చంద్రబాబు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, తదితరులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైలం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు.
శ్రీశైలంలో కార్తీకమాస మొదటి సోమవారం మల్లన్నకు ప్రీతికరమైన రోజు.. దీంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది.. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
భక్తుల దర్శనాలపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2 నుండి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో కార్తీక శని, ఆది,సోమ,పౌర్ణమి,ఏకాదశి రోజులలో సామూహిక,గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలను శ్రీశైలం దేవస్థానం రద్దు చేసింది.
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవం వైభవంగా సాగింది.. శ్రీశైలం దేవస్థానం వైదిక కమిటీ సూచన మేరకు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా బంగారు స్వర్ణరథోత్సవం దేవస్థానం ఇంఛార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం ఈవో డి.పెద్దిరాజును బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెద్దిరాజును తన మాతృ సంస్థకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. ఏడో రోజు ఉత్సవాల్లో భాగంగా నేడు సాయంత్రం కాళరాత్రి అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. ఇక, గజవాహనంపై ప్రత్యేక పూజలు అందుకోనున్నారు ఆది దంపతులు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు.. మరోరోజు ఆరో రోజు శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా సాగాయి..
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఈ రోజు స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నారు.. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి నేడు స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నట్లు శ్రీశైలం దేవస్థానం అధికారులు వెల్లడించారు..