శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్ల దందా కలకలం సృష్టించింది. వీఐపీ బ్రేక్ సమయంలో నకిలీ టికెట్లతో భక్తులను లోపలికి తీసుకెళ్తూ ఓ వ్యక్తి దొరికిపోయాడు. శ్రీశైల దేవస్థాన సిబ్బంది అనుమానం వచ్చి టికెట్లు తనిఖీ చేయగా.. నకిలీ టికెట్ల గుట్టు రట్టయింది. సదరు వ్యక్తిని ఆలయ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. శ్రీస్వామివారి స్పర్శ దర్శనం పాత టికెట్లను ఫోటోషాప్‌లో ఎడిట్ చేసి.. కొత్త టికెట్లు తరహాలో దందా చేస్తున్నట్లు గుర్తించారు.
ఆధార్ కార్డులో పేర్లకు, టికెట్లలో ఉన్న పేర్లకు తేడా ఉన్నట్లు శ్రీశైలం ఆలయ సిబ్బంది గుర్తించారు. అయితే ఈ ఘటన మూడు రోజుల క్రితం జరగగా.. నకిలీ టికెట్ల కేటుగాళ్ల దందా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయ అధికారులు కేటుగాళ్లను అదుపులోకి తీసుకుని గోప్యంగా విచారిస్తున్నారు. పర్యవేక్షకురాలు హిమబిందు, ఏఈవో స్వాములు నకిలి టికెట్లను స్వాదీనం చేసుకుని ఈవో శ్రీనివాసరావుకు విషయాన్ని వివరించారు. ఆలయ అధికారులు ఈ విషయాన్ని బయటపెట్టలేదు. శ్రీశైలంలో నకిలీ టికెట్ల వ్యవహరం బట్టబయలవడం ఇదే మొదటిసారి. గతంలో చాలాసార్లు నకిలీ టికెట్ల దందా బయపడింది.