CM Chandrababu: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం.. రెండు రాష్ట్రాల నేతలు, పాలక ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు.. నీళ్లపై రాజకీయాలు చేయడం సరికాదు అని హితవు పలికారు… దేవాదుల కట్టాం.. అది గోదావరి పైన ఉంది.. అక్కడి నుంచి పోలవరానికి నీళ్లు వస్తాయి.. పోలవరం నుంచి నీళ్లు తీసుకుంటాం అంటే అభ్యంతరం పెడితే ఎలా? అని ప్రశ్నించారు.. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి.. గోదావరిలో మిగిలే నీళ్లతో రాయలసీమకు నీళ్లు ఇవ్వొచ్చన్న చంద్రబాబు.. గోదావరి నీళ్లు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో నీళ్లను తెలంగాణ కూడా వాడుకోవచ్చు అని వ్యాఖ్యానించారు.
Read Also: CM Chandrababu: వైఎస్ జగన్ అక్రమాలు విచారించాలంటే 30 ఏళ్లు పడుతుంది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
మేం గోదావరి నీళ్లు వాడుకుంటే, తెలంగాణ వారు శ్రీశైలం, నాగార్జున సాగర్ నీళ్లు కూడా వాడుకోవచ్చు. నీటిపై చిల్లర రాజకీయాలు చేయడం సరి కాదు అన్నారు చంద్రబాబు. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. మనం వాడుకున్నాక మిగతా వారికి ఇవ్వడంలో తప్పేమీ లేదు అన్నారు.. రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు కళకళ లాడుతున్నాయి. పంట పండని ప్రాంతాల్లో ఇపుడు వరి పంట సాగు కి సిద్ధం అవుతున్నారు. ప్రజల కోసం నిజమైన రాజకీయం చేస్తే మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి. కేవలం రాజకీయాల్లో ఉండటానికి మాత్రమే రాజకీయాలు చేయడం సరి కాదు అన్నారు..
ఇక, 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్టుకు అన్ని నష్టాలు ఎదురయ్యాయి. డయాఫ్రమ్ వాల్ కాపాడుకోవడానికి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేకపోయారు. ఆరు సంవత్సరాలకంటే ముందే ప్రారంభం కావాల్సిన ప్రాజెక్ట్, గత ప్రభుత్వ తప్పిదాల కారణంగా మరో 6 ఏళ్లు ఆలస్యం అవుతుంది అన్నారు చంద్రబాబు.. గ్యాప్ 1 పనులు జూన్ 2026కి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. గ్యాప్ 2 పనులు జూన్ 2027కి పూర్తి చేస్తామని.. మొత్తం ప్రాజెక్ట్ 41.15 మీటర్ల వరకు జనవరి 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం అన్నారు చంద్రబాబు.. పోలవరం రాష్ట్రానికి ఒక వరం, జీవనాధి. పట్టిసీమ లిఫ్ట్ పూర్తి చేసి పదేళ్లు దాటినా, కృష్ణ డెల్టాకు పూర్తి స్థాయిలో సాగు నీరు అందించాము. గ్లోబల్ హబ్‌గా రాయలసీమని తయారు చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. గోదావరి జిల్లాలకంటే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు..