Srisailam Gates Lifted: ఎగువ రాష్ట్రాలతో పాటు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది భారీ వర్షాలు కురిశాయి.. ప్రాజెక్టులు, నదులు, చెరువులు, కుంటలు ఇలా కొన్ని ప్రాంతాలను మినహాయిస్తే అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.. ఇక, పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలతో రైతన్నలు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి.. అయితే, ఏడాదిలో మరోసారి శ్రీశైలం జలాయం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు నీటిపారుదల శాఖ అధికారులు.. శ్రీశైలం జలాశయానికి మరోసారి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.. ఎగువనున్న జూరాల, సుంకేసుల, హాంద్రీ నుండి వరద నీరు రావడంతో శ్రీశైలం జలాశయం నుండి ఈ ఏడాది ఏడోవ సారి రేడియల్ గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు అధికారులు.. శ్రీశైలం జలాశయం ఒక గేటు 10 అడుగుల మేర ఎత్తి.. దిగువకు నీరు విడుదల చేశారు అధికారులు.. ఇక, జలాశయం ఇన్‌ఫ్లో 68,691 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 90,293 క్యూసెక్కులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.60 అడుగులుగాఉంది.. పూర్తిస్థాయి నీటి నిలువ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 213.4011 టీఎంసీలుగా ఉంది.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది..
Read Also: CM Revanth Reddy : అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్.. నిర్లక్ష్యం వహిస్తే అంతే సంగతి..!