Asia Cup 2022: ఈనెల 27 నుంచి దుబాయ్ వేదికగా ఆసియాకప్ 2022 జరగనుంది. ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక వంటి జట్లతో పాటు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు మరో క్వాలిఫయర్ జట్టు కూడా పాల్గొంటాయి. ఈ ఏడాది జరగబోతున్న ఆసియాకప్ 15వది. అంటే 2018 వరకూ 14 టోర్నీలు జరిగాయి. మొదటిసారి ఆసియాకప్ 1984లో జరిగింది. 2016లో తొలిసారి ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరిగింది. అందులో ఇండియా విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2018లో చివరిసారి…
Bloomberg survey On Recession: కోవిడ్ 19, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక రంగాన్ని అస్థిర పరిచాయి. ఈ నేపథ్యంలో పలు దేశాల ఆర్థిక పరిస్థితులు దారుణం దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచ దేశాాలను ఆర్థిక మాంద్య భయాలు వెంటాడుతున్నాయి. అయితే తాజాగా ఆర్థిక మాంద్యంపై బ్లూమ్ బర్గ్ ఓ నివేదికను వెల్లడించింది. ప్రపంచంలో రానున్నటువంటి ఆర్థికమాంద్యం గురించి బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. వీటిలో ఆసియా దేశాలతో పాటు యూరప్, అమెరికా దేశాల గురించి ప్రస్తావించారు.
Man Donation With Begging: మనుషులు చాలా రకాలుగా ప్రవర్తిస్తుంటారు. కొంతమంది సంపాదించింది ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడతారు. ఇతరులకు పైసా కూడా ఇవ్వరు. పిసినారిగా వ్యవహరిస్తుంటారు. మరికొందరు మాత్రం తమ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు చేసి మరీ తెగ ఖర్చు చేస్తుంటారు. అయితే తమిళనాడులోని ఓ వ్యక్తి మాత్రం తన దగ్గర డబ్బులు లేకపోయినా భిక్షాటన చేసి ఓ ప్రభుత్వ పాఠశాల కోసం విరాళం ఇచ్చాడు. ఆ విరాళం వందల్లోనో, వేలల్లోనో కాదు.. ఏకంగా…
Asia Cup 2022 promo: ఆసియా కప్ 2022 టోర్నీ కోసం సమయం ఆసన్నమైంది. రాజకీయ సంక్షోభం కారణంగా శ్రీలంకలో జరగాల్సిన ఈ టోర్నీని యూఏఈకి మార్చారు. దీంతో యూఏఈ వేదికగా ఆగస్ట్ 27 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. టీ20 వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆసియా కప్ టోర్నీని టీ20 ఫార్మాట్‌లో డిజైన్ చేశారు. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ ఇదివరకే…
ద్వీప దేశం శ్రీలంకలో మళ్లీ అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Chandra Babu Fires on YCP Leaders: ఆంధ్రప్రదేశ్‌ను ప్రతిపక్షాలు శ్రీలంకతో పోల్చడంపై వైసీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేయడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీలంకలో ఉన్న దుర్భర పరిస్థితులే ఏపీలో ఉన్నాయని.. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటి నుంచో సకాలంలో జీతాలు చెల్లించట్లేదని, తమ జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులను విత్ డ్రా చేసుకునే పరిస్థితుల్లో ఉద్యోగులు లేరని…
ysrcp mp talari rangaiah comments about debts in ap government: ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ, జనసేన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. అప్పుల కారణంగా ఏపీ మరో శ్రీలంక కాబోతుందని ప్రచారం చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను వైసీపీ ఎంపీలు తాజాగా ఖండించారు. ఈ మేరకు ఢిల్లీలో వైసీపీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. ఏపీలో అవినీతి లేని పాలనను జగన్ ప్రజలకు అందిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజలకు వందకు వంద రూపాయలు నేరుగా చేరుతున్నాయని……
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. 8వ అధ్యక్షుడిగా విక్రమసింఘేను ఎంపీలు ఎన్నుకున్నారు. మొత్తం 219 ఓట్లకు గాను 134 ఓట్లను సాధించి ఆయన విజయం సాధించారు. బుధవారం జరిగిన పార్లమెంటరీ ఓటింగ్‌లో 134 ఓట్లతో ప్రత్యర్థి డల్లాస్ అలహప్పెరుమాపై గెలుపొందారు.
శ్రీలంక ఆర్థిక సంక్షోభం.. ప్రజల తీవ్ర ఆందోళనల నేపథ్యంలో గత శనివారం అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోయారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లారు. ఇటీవల ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్లమెంట్ స్పీకర్ మహింద యాప అబేవర్థనకు పంపాడు. తాజాగా సంక్షోభం నేపథ్యంలో శనివారం శ్రీలంక పార్లమెంట్ సమావేశం అయింది. గొటబాయ రాజపక్స రాజనీమా లేఖను పార్లమెంటరీ సెక్రటరీ జనరల్ ధమ్మిక దసనాయకే చదివి వినిపించారు. ‘‘శ్రీలంకను చుట్టుముట్టిన ఆర్థిక…