Asia Cup 2022 promo: ఆసియా కప్ 2022 టోర్నీ కోసం సమయం ఆసన్నమైంది. రాజకీయ సంక్షోభం కారణంగా శ్రీలంకలో జరగాల్సిన ఈ టోర్నీని యూఏఈకి మార్చారు. దీంతో యూఏఈ వేదికగా ఆగస్ట్ 27 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. టీ20 వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆసియా కప్ టోర్నీని టీ20 ఫార్మాట్‌లో డిజైన్ చేశారు. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ ఇదివరకే అర్హత సాధించాయి. ఆరో బెర్త్ కోసం హాంకాంగ్, సింగపూర్, కువైట్, యూఏఈ మధ్య క్వాలిఫైయింగ్ రౌండ్ నిర్వహించనున్నారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఆసియా కప్ ప్రోమోను విడుదల చేసింది. 45 సెకండ్ల పాటు సాగిన ఈ ప్రోమో టీమిండియా అభిమానులను ఆకట్టుకుంటోంది.
Read Also: World Athletics Championship: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. 19 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం
ఈ ప్రోమో సాంగ్‌లో లిరిక్స్ భారత క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాయి. ‘మా భారత్ నెంబర్ వన్. ఇప్పుడు మేం ఆసియా కప్‌ను గెలుస్తాం. మా పొరుగుదేశాలు కూడా ఈ టోర్నీని గెలవడానికి ఆరాటపడుతున్నాయి. కానీ సగర్వంగా ఎగురుతున్న మువ్వన్నెల జెండా సాక్షిగా మేమిక్కడికి వచ్చింది గెలవడానికే అని మా ప్రత్యర్థులకు చెబుతున్నాం’ అనే అర్థం వచ్చేలా ప్రోమో సాంగ్‌ను రూపొందించారు. ఈ ప్రోమోలో భారత ఆటగాళ్లతో పాటు పాకిస్థాన్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, షాహిన్ అఫ్రిది, బంగ్లాదేశ్ ఆటగాళ్లు షకీబ్ అల్ హసన్, అఫ్గానిస్తాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ కనిపించారు. ఈ టోర్నీలో ఆగస్టు 28న భారత్-పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. కాగా 1984 నుంచి ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు భారత జట్టు ఏడుసార్లు ట్రోఫీ నెగ్గింది. శ్రీలంక ఐదుసార్లు గెలుపొందగా పాకిస్తాన్ రెండు సార్లు విజేతగా నిలిచింది.
The battle for Asian supremacy is 🔛. Get set to #BelieveInBlue as @ImRo45 leads #TeamIndia at the #AsiaCup2022!💙
Starts Aug 27 | Star Sports & Disney+Hotstar pic.twitter.com/K2hcfuGeBK
— Star Sports (@StarSportsIndia) July 22, 2022