Bloomberg Survey: ఇండియాలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం “జీరో”.. ఈ దేశాల్లో పరిస్థితి దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bloomberg survey On Recession: కోవిడ్ 19, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక రంగాన్ని అస్థిర పరిచాయి. ఈ నేపథ్యంలో పలు దేశాల ఆర్థిక పరిస్థితులు దారుణం దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచ దేశాాలను ఆర్థిక మాంద్య భయాలు వెంటాడుతున్నాయి. అయితే తాజాగా ఆర్థిక మాంద్యంపై బ్లూమ్ బర్గ్ ఓ నివేదికను వెల్లడించింది. ప్రపంచంలో రానున్నటువంటి ఆర్థికమాంద్యం గురించి బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. వీటిలో ఆసియా దేశాలతో పాటు యూరప్, అమెరికా దేశాల గురించి ప్రస్తావించారు.

Also Read
ఈ నివేదిక సంచలన విషయాన్ని వెల్లడించింది. భారత్ తో ఆర్థికమాంద్యం వచ్చే పరిస్థితి దాదాపుగా ‘జీరో’ అని.. ఆర్ధికమాంద్యం వచ్చే అవకాశం లేదని వెల్లడించింది. ప్రపంచంలో శ్రీలంకలో 85 శాతం ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ఆసియా దేశాల్లో 20-25 శాతం ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం ఉందని.. యూరోపియన్ దేశాల్లో 50-55 శాతం వరకు ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం ఉందని.. అమెరికాలో ఆర్థికమాంద్యం 40 శాతం వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఇండోనేషియాలో 3 శాతం, ఫిలిప్పీన్స్ 8 శాతం మాత్రమే ఆర్థికమాంద్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని బ్లూమ్ బర్గ్ వెల్లడించింది.
Read Also: COVID19: వరసగా రెండో రోజు 20 వేలకు పైగా కరోనా కేసులు..
శ్రీలంకలో పాటు న్యూజీలాండ్ లో 33 శాతం రిసిషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో 25 శాతం వరకు ఛాన్సులు ఉన్నాయని బ్లూమ్ బర్గ్ అంచనా వేసింది. చైనా, పాకిస్తాన్ దేశాల్లో 20 శాతం అవకాశాలు ఉన్నట్లుగా బ్లూమ్ బర్గ్ నివేదిక అంచానా వేసింది. ముఖ్యంగా యూరోపియన్ దేశాలు ఆర్థికమాంద్యంతో భారీగా దెబ్బతినే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. భారత్ లో వ్యవసాయ రంగం ముందంజలో ఉందని.. దేశంలో ఆహార కొరత, ఆహార ద్రవ్యోల్బనం లేదని ఆర్థిక నిపుణులు అంచానా వేస్తున్నారు. మాన్యుఫాక్చర్, సర్వీసెస్ సెక్టార్లు కూడా ఇండియాలో బలంగా ఉందని చాలా మంది చెబుతున్నారు. బ్లూమ్ బర్గ్ తో పాటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) భారత దేశంలో 7.3 శాతం ఆర్థిక వృద్ధి ఉంటుందని వెల్లడించింది.
తాజావార్తలు
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!