ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య హోదా కోసం భారత్, జపాన్‌ల బిడ్‌లకు తమ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే మంగళవారం తెలిపారు.
ఉత్కంఠభరితంగా సాగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ శ్రీలంక జట్టు ఘనవిజయం సాధించింది. పాకిస్తాన్‌పై 23 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. దీంతో 15వ ఎడిషన్ ఆసియా కప్ విజేతగా శ్రీలంక అవతరించింది.
IND Vs SL: ఆసియా కప్‌లో శ్రీలంకపై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాలో కెప్టెన్ రోహిత్ శర్మ(72), సూర్యకుమార్(34) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక ముందు 174 పరుగుల లక్ష్యం నిలిచింది. శ్రీలంక బౌలర్లు అద్భుతమైన యార్కర్లతో భారత బ్యాటర్లను ఔట్ చేశారు. లంక బౌలర్లలో మధుశంక 3,…
IND Vs SL: ఆసియా కప్‌లో ఈరోజు మరో ఆసక్తికర సమరం జరగబోతోంది. శ్రీలంకతో టీమిండియా కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మేరకు టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. పాకిస్థాన్‌తో ఆడిన రవి బిష్ణోయ్ స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ అశ్విన్‌కు స్థానం కల్పించింది. అయితే ఆశ్చర్యకరంగా దీపక్ హుడానే కొనసాగిస్తూ అక్షర్ పటేల్‌కు మరోసారి మొండిచేయి చూపించింది. గత…
Asia Cup 2022: ఆసియా కప్‌లో సూపర్-4 రసవత్తరంగా మారింది. పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఓడిపోవడంతో ఇప్పుడు పాయింట్ల టేబుల్ ఆసక్తి రేపుతోంది. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై శ్రీలంక విజయం సాధించడంతో ప్రస్తుతం ఆ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో పాకిస్థాన్ ఉంది. శ్రీలంక నెట్ రన్‌రేట్ 0.589గా నమోదు కాగా పాకిస్థాన్ నెట్ రన్‌రేట్ 0.126గా ఉంది. టీమిండియా నెట్ రన్‌రేట్ మాత్రం -0.126గా, ఆప్ఘనిస్తాన్ నెట్ రన్‌రేట్ -0.589గా ఉంది. పాయింట్ల పట్టికలో…
Nithyananda seeks medical asylum in Sri Lanka: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, అత్యచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే సహాయాన్ని కోరాడు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న నిత్యానంద శ్రీలంక రాజకీయ ఆశ్రయం కోరుతున్నారు. నిత్యానంద ఆరోగ్యం క్షీణించడంతో.. చికిత్స కోసం శ్రీలంక సాయాన్ని అభ్యర్థిస్తూ రణిల్ విక్రమసింఘేకు లేఖ రాశాడు. దీంతో పాటు తన ద్వీప దేశం శ్రీకైలాసలో వైద్యపరమైన మౌళిక సదుపాయాల కొరతను లేఖలో ప్రస్తావించాడు.
లంకలో అత్యంత తీవ్ర ఆర్థక సంక్షోభానికి కారకుడయ్యాడనే ఆరోపణలతో ప్రజాగ్రహానికి గురై విదేశాలకు పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స శుక్రవారం ద్వీపదేశంలో అడుగుపెట్టారు.
Asia Cup 2022: ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్ చేతిలో భంగపడ్డ శ్రీలంక.. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి సూపర్-4 బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 180కి పైగా పరుగులు చేసినా శ్రీలంక ఛేదించి 2 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. అటు శ్రీలంకపై పరాజయంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలోనూ బంగ్లాదేశ్ ఓటమిపాలైంది. ముఖ్యంగా శ్రీలంకతో మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో…
శ్రీలంకలో చైనా నిర్మించిన హంబన్‌తోట ఓడరేవు వద్ద ఓడరేవుకు చేరుకున్న చైనా సైనిక సర్వే నౌక వారం రోజుల తర్వాత సోమవారం తిరుగు ప్రయాణమైంది. ఈ నౌక శ్రీలంకకు రావడం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.