తూర్పుమధ్య బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం శనివారం రాత్రికి తుపానుగా బలపడుతుంది. ఉత్తరంవైపుగా కదులుతూ రేపు(ఆదివారం) ఉదయానికి తీవ్ర తుపానుగా మారి అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల సమీపంలో సాగర్ ద్వీపం-ఖేపుపరా మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
కేరళ పరిసరాల్లోని ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. భానుడి భగ భగకు జనాలు బయటకు రావాలంటే జంకుతున్నారు. వేడితో సతమతమవుతున్న ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చల్లటి కబురు చెప్పింది. సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైయస్సార్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
భారతదేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క ఊహలు గ్యాస్ బుడగ లాగా ఉన్నాయని.. ఎంతో ఎత్తుకు ఎగిరి గ్యాస్ బుడగ చివరకు పేలిపోతుందని సీపీఎం జాతీయ నేత బృంధాకారత్ అన్నారు. శ్రీకాకులంలో ఆమె మాట్లాడుతూ.. భారతదేశంలో జరిగిన మొదటి రెండు విడతల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పరిస్థితి గ్యాస్ బుడగ వలే ఉందన్నారు.
వచ్చే ఎన్నికల్లో నన్ను పోటీ చేయమంటారా? వద్దా..? మీరు చెప్పినట్టే చేస్తాను.. చేతులు ఎత్తి మీ అభిప్రాయాన్ని చెప్పండి అని కోరారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.