రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం పారిశ్రామికవాడలో పర్యటించిన మంత్రి.. వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు శనివారం పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. అక్కవరం గ్రామం సమీపంలో దువ్వాడ శ్రీనివాస్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు అందజేశారు.
ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తామని.. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తామని తెలిపారు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు.. గత వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో 5 వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరు నెలల పాలనలోనే కూటమి ప్రభుత్వంపై భారీ వ్యతిరేకత వచ్చిందని, ఇక ఇక ప్రజల తరఫున నిలబడాల్సిన సమయం వచ్చిందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. 2025 జనవరి మూడో వారం నుంచి జిల్లాల పర్యటన మొదలువుతుందని, ప్రతి పార్లమెంటులో బుధ, గురువారాల్లో తాను నిద్ర చేస్తాను అని చెప్పారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మొదటిసారి చూస్తున్నానని, వైసీపీ పార్టీ నేతలు ఇప్పటికీ ప్రజల్లోకి సగర్వంగా వెళ్ళచ్చన్నారు. వైసీపీకి గత ఎన్నికల్లో 50 శాతం…
నేడు శ్రీకాకుళం జిల్లా నేతలతో సమావేశంకానున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. క్యాంప్ కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు..
గతంలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై సీఎం రివ్యూ మీటింగ్ చేసింది లేదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రస్తుతం జిల్లాలోని చాలా సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇరిగేషన్ , ఇండస్ర్టీలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ రోజు సీఎం దీపం పథకం 2.0 గురించి చెప్పారు. దీపావళి కానుకగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం నియోజకవర్గం, ఈదుపురంలో దీపం 2.0 ఉచిత సిలిండర్ల పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం…
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో 30వ వార్డులోని ఎచ్చర్ల వీధిలోని ప్రభుత్వ పాఠశాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. లోకేష్ పర్యటన నేపథ్యంలో స్కూల్ వద్ద దుర్బర పరిస్థితి నెలకొంది. భారీ వర్షం కారణంగా పాఠశాల ప్రాంగణంలో వర్షపునీరు నిలిచిపోయింది.
రేపు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఇప్పటికే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో.. జిల్లాలోని కళాశాలలకు, అన్ని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు.