గ్రామ దేవత ఊరేగింపు వేడుకలో విషాదం చోటుచేసుకుంది. సిరిమాను విరిగి పడటంతో ఇద్దరు మృతి చెందగా, మరొక ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది.కుప్పిలి గ్రామంలో గ్రామ దేవత ఊరేగింపు వేడుకలు జరుగుతుండగా, పెద్ద సంఖ్యలో స్థానికులు హాజరై సందడి నెలకొల్పారు. ఈ క్రమంలో సిరిమాను ఒక్కసారిగా విరిగి కిందపడటంతో, బుడగట్లపాలెంకు చెందిన కారి పల్లేటి (50) మరియు అప్పన్న (40) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో చుడండి..