MLA Baddukonda Appalanaidu: సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే.. సీఎం వైఎస్ జగన్ మా అన్న అయితే.. చంద్రబాబు మా బావ.. మా బావ పగటి కలలు కంటున్నారు.. రెండు నెలలలో ప్రభుత్వం మారిపోద్ది అంటారు.. అసలు నువ్వు ప్రజలకేం చేసావో చెప్పు మారడానికి అంటూ నిలదీశారు నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు.. శ్రీకాకుళం నియోజకవర్గ వాలంటీర్ల సేవలకు పురష్కారాల ప్రదానోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడితే ఫ్లూట్ వాయించినట్లుంటుంది.. రాష్ట్రంలో ప్రభుత్వ విధివిధానాలు స్పష్టంగా చెప్పగలిగే ఏకైక వ్యక్తి ధర్మాన అన్నారు. ఇక, గ్రామాల్లో కి వెలితే ఇంకా గుర్తేంటి? అంటే ఫ్యాన్ కి బదులు చెయ్యి చెపుతున్నారు.. తండ్రిది చెయ్యి… కోడుకు ది ఫ్యాన్ అని చెబుతున్నామన్న ఆయన.. ప్యాన్ గుర్తును వాలంటీర్లు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
Read Also: Bigg Boss Pallavi Prasanth :పల్లవి ప్రశాంత్ లో ఈ మార్పును అస్సలు ఊహించి ఉండరు.. గ్రేట్ కదా..
ఇక, విశాఖ రాజధాని కోసం తన పదవికి రాజీనామ చేస్తానన్న వ్యక్తి మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ధర్మాన, బొత్స సత్తి బాబు వల్లే.. ఉత్తరాంధ్రకి గుర్తింపు వచ్చింది అని తెలిపారు అప్పలనాయుడు.. ఇక, రెడ్ బుక్ లో పొత్తులుతో ఓడిపోతాం అని రాస్తావు తప్ప ఇంకేం రాస్తావ్ లోకేష్..? అని ఎద్దేవా చేశారు. పంచాయతీ రాజ్ శాఖ చేసిన నీకే పంచాయితీల గురించి తెలీదు అంటూ దుయ్యబట్టారు.. ఇక, సీఎం వైఎస్ జగన్ దూతగా ఉన్నవారు వాలంటీర్లు.. గ్రామాల్లో మాకంటే వాలంటీర్లైనా మీకే గౌరవం ఉంది.. వాలంటీర్ల వల్లే మేం గ్రామాల్లో ధైర్యంగా తిరుగుతున్నాం అన్నారు. మరోవైపు.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని ఎమ్మెల్యేల సీట్లు మారవు.. మీ పని మీరు చేసుకోండని అధిష్టానం స్పష్టం చేసింది.. మీరు అపోహలు పడోద్దన్న ఆయన.. ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వం పై కోపం ఉంది.. టీచర్లను ఉదయాన్నే స్కూల్ కి వెల్లమంటున్నాం అని వారికి జగన్ పై కోపం అన్నారు. మరోవైపు.. తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలిస్తే ఇక్కడ వైఎస్ జగన్ ఓటమి అంటూ ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడిగా లా హడావిడి చేస్తున్నారుని మండిపడ్డారు నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు.