ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీయే గెలిచేది.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డే మళ్ళీ సీఎం అవుతారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ తెలిపారు. జిల్లాలో పార్లమెంట్ గానీ.. అసెంబ్లీ గానీ ఆయన ఎవరు అభ్యర్ధి అంటే వారినే మనం కలిసి కట్టుగా పని చేసి గెలిపించాలి అని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతికి ఎక్కడా తావులేకుండా పాలన అందిస్తున్నామని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యనించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మ్యానిఫెస్టోలో ప్రకటించిన అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 26 వ తేదీ నుంచి వైసీపీ సామాజిక న్యాయ యాత్ర బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది అని వైసీపీ జోనల్ ఇంచార్జ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. సమ సమాజ స్దాపన కోసం సీఎం జగన్ కృషిచేస్తున్నారు..
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోఆరు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు నగరంలోని ఉస్మాన్ సాహెబ్ పేటలో ఉన్న జిల్లా పౌరహక్కుల సంఘం నేత ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఈరోజు తెల్లవారుజామున నుంచి సోదాలు చేపట్టారు.
రుణమాఫీ చేస్తానని చెప్పి ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేశాడు ఇప్పుడు మల్లీ మాయమాటలు చెప్తున్నాడని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అన్నారు. తప్పు చేస్తే మాకు మేము ప్రాయశ్చిత్తం చేసుకుంటాం.. కానీ చంద్రబాబు మాత్రం అలా కాదు అని ఆయన వ్యాఖ్యనించారు.
NC23 Expedition The First Cut Documentation:యదార్థ సంఘటనల ఆధారంగా, రియల్ లొకేషన్‌లలో రూపొందించే సినిమాలకి ప్రీ-ప్రొడక్షన్ చాలా ముఖ్యం అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాగ చైతన్య 23వ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాను దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందు కోసమే ఒక కొత్త విధానాన్ని…
2 Peoples Died in Road Accident at Vizianagaram: రాఖీల కొనుగోలుకు వెళ్లిన ఇద్దరు మృత్యు ఒడికి చేరుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో చోటుచేసుకుంది. స్కూటీపై వెళుతున్న ఒకే కుంబానికి చెందిన ఇద్దరు (బాబాయ్, అమ్మాయి) ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా నుజ్జయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి…
మా కార్యకర్తలు ఆర్ధికంగా చెడిపోయారు.. నాలుగు సంవత్సరాలుగా ఖర్చు మాత్రమే పెట్టారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ఏ కార్యకర్తకు పైసా లబ్ధిలేదు, ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం, మా కార్యకర్తలు పనిచేశారని తెలిపారు.. మా కార్యకర్తలు అందరూ ఆర్ధికంగా పూర్తిగా దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.