శ్రీకాకుళం జిల్లాలో పీఆర్‌టీయూ యూనియన్ భవనాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.
Atchannaidu: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అన్న క్యాంటీన్లను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి అంజలి ఘటించిన తర్వాత మంత్రి మాట్లాడుతూ.. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో 2 అన్న క్యాంటీన్లు ప్రారంభించామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. ఇప్పటికే రోజుకో మలుపు.. పూటకో ట్విస్ట్ ఈ కేసులో వెలుగు చూస్తుండగా.. ఇప్పుడు.. దివ్వెల మాధురిపై కేసు నమోదు చేశారు పోలీసులు..
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో దివ్వెల మాధురి కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె రోడ్డు ప్రమాదానికి గురైంది. కారులో వెళ్తున్న మాధురి.. ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మాధురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడి స్థానికులు ఆమెను పలాస ఆస్పత్రికి తరలించారు.
నా ఇంటిలో ఒక విచిత్ర పరిస్థితి.. నా కుటుంబమే నాపై దాడి చేస్తోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. కుటుంబ వ్యవస్థలో భర్త నిర్ణయానికి భార్య కట్టుబడి ఉండాలి.. కానీ, వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువ.. మైన్‌ను తన పేరు మీద మార్చాలని వాణి ఒత్తిడి చేసేది.. క్వారీ వద్దకు వెళ్లి డబ్బులన్నీ తనకే ఇవ్వాలంటూ రచ్చ చేసిది అన్నారు..
Duvvada Haindavi: శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె.. హైందవి ఎన్టీవీతో మాట్లాడుతూ.. మాకు మా డాడి కావాలి.. మేం మా నాన్నతోనే ఉండాలనుకుంటున్నామన్నారు. మా నాన్నకు చాలా సార్లు చెప్పాం.. మా మంచి చెడు డాడీకి తెలుసు.. ఆయన మరో మహిళ ట్రాప్ లో పడ్డారు..
MLC Duvvada Srinivas: శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో మరోసారి ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కుతుంది. గత రెండేళ్లుగా కుటుంబంలో విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో వేరు వేరుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య జేడ్పీటీసీ దువ్వాడ వాణి ఉంటున్నారు.
Thandel : యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’ (Thandel). ఇప్పటికే సినిమాను షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల నటి సాయి పల్లవి నటిస్తుండడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటీవల శ్రీకాకుళంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళంలో జరిగిన యదార్థ…
గ్రామ దేవత ఊరేగింపు వేడుకలో విషాదం చోటుచేసుకుంది. సిరిమాను విరిగి పడటంతో ఇద్దరు మృతి చెందగా, మరొక ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది.కుప్పిలి గ్రామంలో గ్రామ దేవత ఊరేగింపు వేడుకలు జరుగుతుండగా, పెద్ద సంఖ్యలో స్థానికులు హాజరై సందడి నెలకొల్పారు. ఈ క్రమంలో సిరిమాను ఒక్కసారిగా విరిగి కిందపడటంతో, బుడగట్లపాలెంకు చెందిన కారి పల్లేటి (50) మరియు అప్పన్న (40) అక్కడికక్కడే మృతి చెందారు.…