మత్స్యకారుల కుటుంబాలకు శుభవార్త చెప్పారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. మత్సకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమ ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని ప్రకటించారు.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన.. మత్స్యకారుల సేవలో పేరుతో మత్స్యకార భరోసా పథకానికి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని…
శ్రీకాకుళం జిల్లా జలుమూరులో గుడి గోడలపై అన్యమత ప్రచార రాతలకు సంబంధించి ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. జలుమూరు మండలంలో నాలుగు గుళ్ల పైన అన్యమత సూక్తులు, గుర్తులు రాశారని.. టెక్నికల్ టీమ్స్ తో పాటు తొమ్మిది బృందాలును ఏర్పాటు చేసి ఎంక్వయిరీ చేశామన్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ముగ్గురు నిందితులు పగోటి ఈశ్వరరావు (బుడితి గ్రామం), మామిడి అజయ్ (కాకినాడ జిల్లా), చందక దేవుడు నాయుడు (బుడితి గ్రామం) అని…
శ్రీకాకుళంజిల్లా అభివృద్దికి అన్ని అవకాశాలు ఉన్నా , ప్రజల సహకారం లేకపోవడమే వెనుకబాటుకు కారణం అన్నారు మంత్రి అచ్చెంనాయుడు. ఎయిర్ పోర్ట్ కట్టాలంటే జెండాపట్టుకోని లేస్తున్నారు.. ఎక్కడ అభివృద్ది జరగుతుంది..? దీనిపై చర్చజరగాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వలసలు ఆగాలన్నా , పేదరికం పోవాలన్నా పారిశ్రామికీకరణ జరగాలన్నారు. పాజిటివ్ మైండ్ తో ముందుకు వెళ్తే తప్ప ఇంకో డబ్బై సంవత్సరాలైనా మన జిల్లా ఇలాగే ఉంటుంది.
గత ప్రభుత్యం మాదిరి కక్షసాధింపు చర్యలతో జైళ్ళలో పెట్టాలని మేం ఆలోచించడం లేదు అని కేంద్రమంత్రి రామ్మోహన నాయుడు తెలిపారు. స్వేచ్చ, స్వాతంత్ర్యంతో వ్యవహరించేలా పని చేస్తున్నాం.. అయితే, అంబేద్కర్ కేవలం దళిత నాయకుడు కాదు.. ప్రతి భారతీయుడు గర్వపడే వ్యక్తి అని ఆయన కొనియాడారు.
శ్రీకాకుళానికి చెందిన క్యాన్సర్ పెషేంట్ తో హోం మంత్రి అనిత విడియో కాల్ మాట్లాడారు. ఎనిమిది సంవత్సరాలుగా క్యాన్సర్ తో పోరాడుతున్న లతశ్రీకి ధైర్యం చెప్పారు. మంత్రి అనిత మాట్లాడుతూ.. ధైర్యాన్ని మించిన మెడిసిన్ ఏదీ లేదన్నారు. లతశ్రీని బాధపడొద్దని.. పిల్లలున్నారని.. మీకు మేమంతా అండగా ఉంటామని మంత్రి అనిత చెప్పారు. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నవారు కూడా ధైర్యంగా ఎదుర్కొని ఆరోగ్యంగా ఉంటున్నారు. మీరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. కుటుంబ సభ్యులు అండగా…
స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు 68వ జయంతి సందర్భంగా.. శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా టీడీపీ నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఎర్రన్న ఆశయాలు కొనసాగిస్తామని తెలిపారు. ఎర్రన్నాయుడు బడుగు బలహీన వర్గాల నాయకుడు.. దివంగత ఎన్టీఆర్ ఆశయ సాధనకు ఎర్రన్న పనిచేశారని పేర్కొన్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల మృతి చెందిన పాలకొండ వైసీపీ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు పాలకొండ చేరుకోనున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. పరామర్శ అనంతరం పాలకొండ నుంచి నేరుగా బెంగుళూరుకు వెళ్లనున్నారు. ఇటీవల వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ…
Ratha Saptami 2025: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈసారి కూటమి ప్రభుత్వం తొలిసారిగా రథసప్తమిని రాష్ట్ర పండుగగా గుర్తించి మూడు రోజుల పాటు విశేష ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తొలి రోజున 5,000 మందితో సామూహిక సూర్యనమస్కారాలు నిర్వహించగా కార్యక్రమానికి కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, అనేకమంది విద్యార్థులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం నగర వీధుల్లో…
టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం.. మార్చి నెలలోపు లక్ష కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ప్రతి జిల్లాలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించిన ఆయన.. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సీసీ కెమెరాలు పెట్టేవిధంగా ప్రయత్నిస్తున్నాం అన్నారు.