Rammohan Naidu: ప్రజల అందరికీ డాక్టర్ బాబు జగ్జీవన్ రాం జయంతి శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకాకుళం పట్టణంలో అభివృద్ధి జరగాలని అడుగులు ముందుకు వేస్తున్నాం.. అట్టడుగు కుటుంబం నుంచి దేశ ఉప ప్రధాని అయ్యారు.. అంటరానితం నిర్మూలనకు డాక్టర్ బాబు జగ్జీవన్ రాం కృషి చేశారు.. హరిత విప్లవం కోసం పరితపించారు.. విద్యాను ఆయుధంగా చేసుకొని ముందుకు వెళ్ళారు.. వెనుకబడిన వర్గాలకు కేవలం చదువే పరిష్కారం చూపుతుంది.. సంక్షేమ హాస్టల్స్ గత ఐదేళ్లుగా నిర్వీర్యం చేశారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.
Read Also: Rashmika : రష్మిక మందన్న బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎవరెవరు అటెండ్ అయ్యారు?
ఇక, గత ప్రభుత్యం మాదిరి కక్షసాధింపు చర్యలతో జైళ్ళలో పెట్టాలని మేం ఆలోచించడం లేదు అని కేంద్రమంత్రి రామ్మోహన నాయుడు తెలిపారు. స్వేచ్చ, స్వాతంత్ర్యంతో వ్యవహరించేలా పని చేస్తున్నాం.. అయితే, అంబేద్కర్ కేవలం దళిత నాయకుడు కాదు.. ప్రతి భారతీయుడు గర్వపడే వ్యక్తి అని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో చాలా కష్టాలు ఉన్నాయి.. రాష్ట్రంలో డబ్బు చిల్లి గవ్వ కూడా లేదు.. ఖజానా ఖాళీ అయింది.. అభిమానం, ప్రేమతో ఓటు వేశారు.. ప్రజలకు హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం నెరవేరుస్తున్నామని వెల్లడించారు. శ్రీకాకుళంలో ఒక ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.