హ్యాట్రిక్ విజయాలు..., చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవి...., మంచి వాగ్ధాటి, రాజకీయ వారసత్వం కలిసొచ్చి డైనమిక్ లీడర్‌గా గుర్తింపు. శ్రీకాకుళం ఎంపీ, సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడి గురించి చెప్పుకునే పాజిటివ్ మాటలివి. అన్నట్టుగానే... ఇందులో ఏదీ అసత్యం లేదు, కాదనేవాళ్ళు ఎవరూ లేరు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు బొమ్మరిల్లు సినిమా గుర్తుకు వస్తోందట. ఇప్పటికీ నా చేతులు మీ చేతుల్లోనే ఉన్నాయి డాడీ.. అన్న డైలాగ్‌ని తెగ గుర్తు చేసుకుంటూ సేమ్ సీన్ అని యువ ఎమ్మెల్యేలు ఫీలైపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక్కడ డాడీ కేరక్టర్‌లో మంత్రి అచ్చెన్నాయుడు ఉంటే... కొత్త ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేలు అదే డైలాగ్ చెబుతున్నారట.
శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేట గ్రామానికి చెందిన వైసీపీ నేత, ఉప సర్పంచ్ సత్తారు గోపి దారుణ హత్యకు గిరయ్యది. కోయిరాల జంక్షన్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు కొందరు గోపిపై రాడ్లు, కత్తులతో దాడి చేసి హత్య చేశారు. తల, మెడపై తీవ్ర గాయాలు కావడంతో గోపి అక్కడిక్కడే మృతి చెందాడు. రక్తపు మడుగులో పడిఉన్న గోపి మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. బైక్‌పై వెళ్తుండగా గోపిపై…
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఇంట్రస్టింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే... అవి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కాదు. అలాంటి పోరు ఉంటే... అది షరా మామూలే. కానీ... ఇక్కడ మాత్రం కాస్త తేడాగా ఉందట. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కేంద్రంగా నడుస్తున్న వ్యవహారాలు ఆసక్తికరంగా మారుతున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉన్నారు దువ్వాడ.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనే కాదు.... మొత్తం ఏపీ పాలిటిక్స్‌లో పరిచయం అక్కరలేని పేరు ధర్మాన ప్రసారావు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేశారాయన. కాంగ్రెస్, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీల్లో తనదైన మార్క్ రాజకీయాలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మంత్రి పదవిలో ఉన్న ధర్మాన... ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు. ఏడాదిగా బయట ఎక్కడా కనిపించడం లేదాయన.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద పలాస రాజకీయాలు కాస్త తేడాగా ఉంటాయని చెప్పుకుంటారు. అందుకు తగ్గట్టే.... అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లా అంతా ప్రశాంతంగా ఉంటే... పలాసలో మాత్రం రాజకీయ కొలిమి రగులుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు పొలిటికల్ సెగలు పెరిగిపోతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మంటెక్కిస్తున్నారు నేతలు.
వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యాక.... ఇటు ఇంటికి, అటు పార్టీకి పూర్తిగా దూరమయ్యారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. దీంతో దశాబ్దాలుగా ఆయన్ని నమ్ముకుని ఉన్న కేడర్ చెల్లాచెదురవుతోందట. దీంతో టెక్కలి నియోజకవర్గ వైసీపీ కేడర్‌ను నడిపించే బాధ్యతను శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి తలకెత్తుకున్నారట. వైసీపీ దూరం పెట్టాక... అడపదడప మినహా..
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రూరల్ మండలంలోని జాతీయ రహదారిలో నీలం జూట్ మిల్ దగ్గర ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సుతో సహా నాలుగు లారీలు ధ్వంసమయ్యారు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: IPL 2025: నేటి…
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) భారీ వర్ష సూచన జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణ విషయానికి వస్తే, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, , హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. Peddireddy…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా పర్యటనపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు.. సీఎం చంద్రబాబు పర్యటన పెట్టుకున్నారు.. కానీ, నేటి పర్యటన అత్యంత నిరుత్సాహానికి గురిచేసిందన్నారు.. అసలు, మత్స్యకారులకు ఏం చేశామో చెప్పలేదు, ఏమి చేయబోతున్నారో చెప్పలేదని విమర్శించారు.. 44 ఏండ్లలో టీడీపీ మత్స్యకారులకు ఏం చేసిందో చెబితే సంతోషించేవాళ్లం అన్నారు.