CM Chandrababu: మత్స్యకారుల కుటుంబాలకు శుభవార్త చెప్పారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. మత్సకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమ ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని ప్రకటించారు.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన.. మత్స్యకారుల సేవలో పేరుతో మత్స్యకార భరోసా పథకానికి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని కూటమి సర్కార్ రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచగా.. మొత్తం రూ.259 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు..
Read Also: Rahul Gandhi: ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయమే.. ప్రతిపక్షాలను అణచివేసే కుట్రలు జరుగుతున్నాయి..
ఇక, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం సముద్ర తీరంలో మత్స్యకారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. వారి సమస్యలు తెలుసుకున్నారు. మత్స్యకారుల జీవన విధానాన్ని పరిశీలించారు.. శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మత్య్సకార కుటుంబాలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మత్య్సకార కుటుంబం అయిన మద్దు పోలేష్, రామలక్ష్మీతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కారి రాంబాబు, ఉప్పాడ సీతోగ్య, చింతపల్లి ఎర్రయ్యతో ముచ్చటించారు. ఇక, వారితో మాట్లాడి చేపలు ఎండబెట్టే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు, మత్స్యకార శాఖ ఏర్పాటు చేసిన వివిధ మత్స్యకార స్టాల్స్ ను సందర్శించిన సీఎం చంద్రబాబు గారు, మత్స్యకారులకు ప్రభుత్వం అందిస్తున్న పరికరాలను పరిశీలించారు.
Read Also: Pakistan: పాకిస్తాన్ ఆర్మీలో భయం భయం.. కుటుంబాలను యూకే తరలిస్తున్న అధికారులు..
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మడ్డువలస , నారాయణపురం , తోటపల్లి కలువలిపూర్తి చేస్తాం. జన్మభూమి పథకం నాడు ప్రారంభిస్తే అంత ముందుకు వచ్చారు. P4 పథకం కొత్త ఆలోచన. అభివృద్ధి చెందిన మార్గదర్శలు నుంచి అట్టడుగు ఉన్నవారిని ఆదుకోవాలని కోరాం అన్నారు.. గత ఐదు ఏళ్లు తలసరి ఆదాయం తగ్గిపోయింది , అభివృద్ధి లేదు. ఇప్పుడు ప్రతి కుటుంబాన్ని బాగుచేసి బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. అంతా సమానం గా ఆదాయం పెరగాలని విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో 4 సెంట్లు , పట్టణాల్లో 3 సెంట్లు ఇస్తాం. మొత్తం పెర్మెంట్ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అన్నారు.. ఆదాయం పెంచడానికి, పేదరిక నిర్మూలనకు కృషిచేస్తూ వినూత్న కార్యక్రమాలు చేస్తున్నాం అన్నారు. బుడగట్ల పాలెంలో 195 మంది అట్టడుగున ఆదాయం వున్నవారు ఉన్నారు. అన్నదాతలకు 20,000 రూపాయలు మూడు వాయిదాలలో వేస్తాం అన్నారు. జూన్‌లో తల్లికి వందనం కింద రూ.15,000 వేశాం అన్నారు.
Read Also: Ponnam Prabhakar: మంత్రి చొరవతో దుబాయ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న గల్ఫ్ బాధితుడు
మత్స్యకారుల జీవితమంతా పేదరికంలో బ్రతకాల.. 555 మత్స్యకార గ్రామాలు ఉన్న నేను బుడగట్ల పాలెం వచ్చాను అన్నారు చంద్రబాబు.. 29 శాతం చేపల ఉత్పతి మన రాష్ట్రంలోనే అవుతుంది.. 6 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాం.. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎచ్చర్లలో పెడతాం. 69000 మంది మత్స్యకారులకు ఫించన్లు ఇచ్చాం. లీటర్ డీజిల్ కి 9 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. మత్స్యకార జీవితాలలో వెలుగుకు ఒక ప్రణాళిక నిర్మిస్తాం.. 9 షిప్పింగ్ హార్బర్ నిర్మిస్తాం.. బుడగట్ల పాలెంలో ఒక సంవత్సర కలాంలో హార్బర్ నిర్మిస్తాం అని తెలిపారు.. మీజీవితలలో మార్పు తీసుకు వస్తాం.. దేశంలో ఎక్కడ ఉన్నా శ్రీకాకుళం కాలనీ ఉంటుంది. 26 జిల్లాలో తక్కువ తలసరి ఆదాయం శ్రీకాకుళం ఉంది. తెలివితేటలు తక్కువలేదు, వనరులు ఉన్నాయి.. సముద్రతీరం ఉంది , నదులు ఉన్నాయి, బంగారం పండే భూమి ఉంది. శ్రీకాకుళం జిల్లా బాగుచేసేందుకు మళ్లీ మళ్లీ వస్తాను అని తెలిపారు.