వీరుడా వందనం అంటూ అమర వీరునికి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తామరలో తుది వీడ్కోలు పలికారు. జాతీయ జెండాతో ఐదు కిలోమీటర్ల బైక్ ర్యాలీ చేసి అంతిమ వీడ్కోలు పలికారు. గత నెల 24న ఝార్ఖండ్ లో దురదృష్టవశాత్తు హెచ్ ఎఫ్ ఎస్ ఎల్ గ్రైనైడ్ పేలి పాతపట్నం మండలం తామర గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాను పడాల యోగేశ్వరరావు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే జూన్ 15 రాత్రి ఆయన రాంచీలోని ఓ…
ప్రేమకు ఎల్లలు లేవంటారు.. హద్దులు లేవంటారు. అందుకే ఎవరు ఎవరి ప్రేమలో పడతారో ఎవరూ చెప్పలేరు. ఉదాహరణకు మీకు లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి నటించిన పడమటి సంధ్యారాగం సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో విజయశాంతి అమెరికాకు చెందిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తాజాగా అచ్చం ఇదే తరహాలో ఏపీకి చెందిన ఓ అబ్బాయి అమెరికా అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన కందుల కామరాజు- లక్ష్మీ దంపతుల…
శ్రీకాకుళం టీడీపీలో మెదటినుంచీ రెండువర్గాలు. ఒకటి కింజరాపు కుటుంబం.. రెండోది మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ వర్గం. అయినప్పటికీ తనదైనశైలిలో రాజకీయాలు నెరుపుతూ సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసారు అప్పల సూర్యనారాయణ. 2014లో అప్పల సూర్యనారాయణ సతీమణి గుండ లక్ష్మిదేవి ఇరవైవేల ఓట్ల తేడాతో ధర్మాన ప్రసాదరావును ఓడించారు. 2019లో మాత్రం స్వల్ప తేడాతో ఓడిపోయారు. నాటి నుంచి చాపకింద నీరులా పార్టీలో అంతర్గత పోరు కోనసాగుతోందట. నియెజకవర్గం మినీ మహానాడు వేదికగా శ్రీకాకుళం టీడీపీలో మరోసారి…
గతంలో నేతలు పాదయాత్రలు చేస్తే.. వారి తనయులు వారిలాగే పాదయాత్రలకు పూనుకున్నారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ అధినేత, వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. 2019లో ఆయన అధికారం హస్తగతం చేసుకున్నారు. రెండుసార్లు తండ్రితనయులు పాదయాత్రల ద్వారా అత్యున్నత పీఠం అధిరోహించారు. అదే రీతిలో చంద్రబాబు కూడా పాదయాత్ర చేసి అధికారం పొందారు. చంద్రబాబు బాటలోనే ఆయన…
సాధారణంగా పెద్దవారు ఒక మాట చెప్తూ ఉంటారు.. మహిళ ఏదైనా తట్టుకుంటుందేమో కానీ తన భర్తను వేరొకరితో పంచుకోవడం మాత్రం తట్టుకోలేదని.. అయితే ఇది కొంత వరకు నిజమే.. తనకు మాత్రమే పంచాల్సిన ప్రేమను భర్త వేరొకరికి పంచుతుంటే భార్యకు కోపం రావడం సహజం.. అయితే ఆ కోపంలో ఎంత నీచానికైనా దిగజారడం నేరం. తాజాగా ఒక భార్య, తన భర్త వేరొక యువతితో సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో దారుణానికి పాల్పడింది. భర్త మాట్లాడుతున్న అమ్మాయిని ఇంటికి…
శ్రీకాకుళం జిల్లా నుంచి రాజకీయ యాత్రలు ప్రారంభిస్తే తిరుగే ఉండదని భావిస్తాయి పొలిటికల్ పార్టీలు. తాజాగా వైసీపీ తమ మంత్రులతో చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కూడా అదేకోవలోకి వస్తుంది. పైగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 90 శాతం మంది బడుగు బలహీన వర్గాల వారే. అధికారపార్టీ కూడా ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా భావించడంతో.. అంతే అట్టహాసంగా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయంలో సిక్కోలు వైసీపీ నేతలు బాధ్యతలు తీసుకుంటారని లెక్కలేసుకున్నాయి పార్టీ వర్గాలు. అంతర్గత…
అడవుల్లో వుండాల్సిన వన్యప్రాణులు, పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు రోడ్లమీదకు, జనం మీదకు వచ్చేస్తున్నాయి. దీంతో జనం కంటిమీద కునుకులేకుండా గడపాల్సి వస్తోంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో గురువారం రాత్రి ఎలుగుబంటి హల్ చల్ చేసింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయ పరిసరాలతో పాటు ప్రక్కన నున్న అపార్టుమెంటు ప్రాంగణంలోకి చొరబడి కాసేపు చక్కర్లు కొట్టింది. తమ ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తుందని తెలుసుకున్న స్థానికులు భయాందోళన చెందారు. కాసేపు ఆ ప్రాంతంలో తచ్చాడిన ఆడిన…
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అసని తుఫాను వల్ల తీరప్రాంతం అలజడిగా వుంది. అక్కడక్కడా భారీవర్షాలు పడుతున్నాయి. అయితే తుఫాను కారణంగా ఓ మందిరం తీరానికి కొట్టుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ వింత చోటుచేసుకుంది. అసని తుఫాను ప్రభావంతో ఇతర దేశానికి చెందిన ఓ మందిరం సున్నాపల్లి రేవుకు కొట్టుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు చేరిన ఇతర దేశానికి చెందిన బంగారు వర్ణం కలిగిన రథంగా దీనిని భావిస్తున్నారు. అసాని తుపాన్ ప్రభావంతో ఇది సముద్రం…
ఆంధ్ర రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతం తూర్పుతీరంలో ఏర్పడిన ఆసాని తుఫాను ఏపీ వైపు దూసుకొస్తుంది. ఈనెల 10 నాటికి తుఫాను రాష్ట్రంలో ప్రవేశిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్యంగా పయనించి వాయుగుండంగా బలపడుతుంది. ఆ తరువాత ఈరోజు సాయంత్రానికి తూర్పుమధ్య…