కాకినాడ జిల్లాలో బెంగాల్ టైగర్, చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు, శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి. వనాల్లో వుండాల్సిన వన్యప్రాణులు జనాల్లోకి వస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామంలో ఓ ఇంటిలో తిష్టవేసిన ఎలుగు బంటి జనాన్ని ఉరుకులు, పరుగులు పెట్టించింది. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ పి.రామ్మోహనరావు (ఐఎఫ్‌ఎస్) ఆధ్వర్యంలో ఆపరేషన్ బల్లూక్ నిర్వహించారు. ఎట్టకేలకు ఎలుగుబంటిని పట్టుకుని బోనులో బంధించారు. ఆపరేషన్ లో విశాఖ జూకి చెందిన మత్తు డాక్టర్, నిపుణులైన సిబ్బంది పాల్గొన్నారు. దీంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.
పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు – కిడిసింగి గ్రామాలలో ప్రజలపై ఎలుగుబంటి దాటి ఘటన కలకలం రేపింది. ఎలుగుబంటి దాడిలో ఒకరు చనిపోగా, మరికొందరు ఆస్నత్రి పాలయ్యారు. మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఎలుగుబంటి దాడి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు శ్రీకాకుళం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఎలుగు బంటి దాడి గురించి మంత్రి ఫారెస్ట్, పోలీస్, రెవిన్యూ అధికారులతో మాట్లాడారు. ఎలుగుబంటిని పట్టుకోవాలని కూడా మంత్రి ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అధికారులు ఎలుగుబంటిని బంధించేందుకు ఆపరేషన్ నిర్వహించారు.
ఎలుగుబంటి దాడిలో మరణించిన వ్యక్తి కుటుంబానికి తక్షణ సాయం కింద రూ. 2.5లక్షలు చెల్లిస్తామని అనంతరం మరొక 2.5లక్షలు రూపాయలు మొత్తంగా ప్రభుత్వం తరపున 5లక్షల రూపాయలు పరిహారం చెల్లిస్తామని మంత్రి చెప్పారు. బాధిత కుటుంబాలకు పూర్తి అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఎలుగుబంటిని బంధించడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.
Live : Maharashtra Political Crisis : మహారాష్ట్రలో..రిసార్ట్ రాజకీయం.! ప్రభుత్వం పడిపోనుందా..? |