ఎమర్జింగ్ ఆసియా కప్ వన్డే టోర్నీలో పాల్గొనే భారత్-ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం ప్రకటించింది. దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటుతున్న ఆంధ్ర పేసర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. నితీశ్ గత ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కానీ ఒకే మ్యాచ్ లో అతనికి అవకాశం వచ్చింది.
శ్రీలంకలోని కొలంబో వేదికగా జులై 13 నుంచి 23 వరకు వన్డే ఫార్మాట్ లో ఆసియా కప్ జరనుంది. ఇప్పటి వరకు 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన నితీశ్ కుమార్ రెడ్డి 27 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తుండటంతో జూనిల్ సెలెక్షన్ కమిటీ నితీశ్ కుమార్‌కు అవకాశం కల్పించింది.
మరోవైపు భారత్-ఏ జట్టుకు యశ్ ధూల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. అభిషేక్‌శర్మ వైస్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. నితీశ్ కుమార్ రెడ్డితో పాటు ఐపీఎల్ ప్లేయర్లు సాయి సుదర్శన్, రియాన్ పరాగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, ఆకాశ్ సింగ్, రాజ్యవర్థన్‌లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.
Rashmi Gautam: స్టుపిడ్ అంటూ రెచ్చిపోయిన నెటిజన్.. దిమ్మతిరిగేలా కౌంటరిచ్చిన రష్మీ
ఈ టోర్నీలో ఎనిమిది జట్లు రెండు గ్రూపుల్లో పోటీ పడుతాయి. భారత్, నేపాల్, యూఏఈ, పాకిస్థాన్ గ్రూప్–బిలో ఉన్నాయి. ఆతిథ్య శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, ఒమన్ గ్రూప్–ఎలో బరిలో నిలిచాయి. జులై 13న యూఏఈతో తొలి మ్యాచ్ ఆడే భారత్.. 15న పాకిస్థాన్, 18న నేపాల్‌తో ఆడనుంది.
V. Hanumantha Rao: తెలంగాణ రైతులను పట్టించుకోరు గానీ.. బీహార్, పంజాబ్ రైతులకు డబ్బులిచ్చారు
భారత –ఎ జట్టు: యష్ ధుల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ (వైస్ కెప్టెన్ ), నికిన్ జోస్, ప్రదోష్ రంజన్ పాల్, రియాన్ పరాగ్, నిషాంత్ సింధు, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (కీపర్), ధ్రువ్ జురెల్ (కీపర్), మానవ్ సుతార్, యువరాజ్ సింగ్ దోడియా, హర్షిత్ రాణా, ఆకాష్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, రాజవర్ధన్ హంగర్గేకర్. స్టాండ్‌బై ఆటగాళ్లు: హర్ష్ దూబే, నెహాల్ వధేరా, స్నెల్ పటేల్, మోహిత్ రెడ్కర్.