Home
Sports
Sports News
-
T20: టీ20లో హైదరాబాద్ కుర్రాడికి చోటు.. వెస్టిండీస్ టీ20 జట్టు ప్రకటన
వెస్టిండీస్‌తో జరిగే ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అందులో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మకు చోటు దక్కింది. గత ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన తిలక్.. ఎట్టకేలకు టీ20ల్లో స్థానం దక్కించుకున్నాడు. అందరూ అనుకున్నట్టుగానే జాతీయ స్థాయిలో ఆడుతాడని పలువురు క్రికెటర్లు చెప్పారు. -
Virat Kohli: కోహ్లి ఆ షాట్‌పై ఇండియా-పాకిస్తాన్ ఫ్యాన్స్ ఫైట్..!
వెస్టిండీస్‌తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ చెమటలు వచ్చేలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. బార్బడోస్‌లో నెట్ ప్రాక్టీస్ చేస్తోన్న విరాట్ కోహ్లీ.. అద్భుతమైన షాట్లు ఆడాడు. ఇండియా -పాకిస్తాన్ అభిమానులు ఒకరినొకరు తిట్టుకునేలా విరాట్ ఏ షాట్ ఆడాడని మీరు అనుకుంటున్నారా..! అసలు విషయానికి వస్తే.. బార్బడోస్ లో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న విరాట్.. అశ్విన్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడాడు. -
Virat Kohli: యువ ఆటగాడికి కోహ్లీ పాఠాలు.. చెప్పినట్లు చేస్తే చెలరేగడమే..!
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విడుదలైంది. అందులో కింగ్ కోహ్లీ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు కనిపిస్తుంది. తన తోటి ఆటగాళ్లతో కలిసి నెట్ లో బిజీగా గడిపేస్తున్నాడు. -
Cricket: భారత–’A’ జట్టులో తెలుగు కుర్రాడు..
ఎమర్జింగ్ ఆసియా కప్ వన్డే టోర్నీలో పాల్గొనే భారత్-ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం ప్రకటించింది. దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటుతున్న ఆంధ్ర పేసర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. -
Zaman Khan: హడలెత్తిస్తున్న పాకిస్తాన్ బౌలర్.. అఫ్రిది కంటే మెరుపు వేగం..!
పాకిస్థాన్ బౌలింగ్ లో మెరుపు వేగంతో బౌలింగ్ వేసే బౌలర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చేది షహీన్ షా ఆఫ్రిది. అంతేకాదు పాకిస్తాన్ బౌలర్లలో అఫ్రిది తర్వాత నసీమ్, హరీస్ సోహైల్ మంచి ప్రదర్శన చూపిస్తారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ బౌలర్లలో మరో ఆటగాడు తన పేరును నమోదు చేసుకున్నాడు. 21 ఏళ్ల ఉన్న జమాన్ ఖాన్.. అతను బౌలింగ్ చేసే విధానం చూస్తే.. రాబోయే రోజుల్లో ప్రత్యర్థులకు షాహీన్ కంటే బలంగా మారే అవకాశం ఉంది. -
Team India ODI WC: వరల్డ్ కప్‌లో నాలుగో నంబర్లో ఎవరు బ్యాటింగ్ చేస్తారు? అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న..!
ప్రపంచకప్‌లో భారత్ నంబర్-4 బ్యాట్స్‌మెన్ ఎవరు అనే ప్రశ్న అభిమానుల మదిలో మెదులుతోంది. శ్రేయాస్ అయ్యర్ ఈ నంబర్లో ఆడాల్సి ఉంది. కానీ అతను ప్రస్తుతం గాయంతో ఉన్నాడు. అతను ఎప్పుడు తిరిగి ఫిట్‌గా అవుతాడనేది తెలియడంలేదు. మరోవైపు ప్రపంచ కప్ కోసం భారత జట్టులో టాప్ ఆర్డర్లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీల స్థానం స్థిరంగా ఉంది. నాలుగో నెంబర్ లో శ్రేయస్ లాంటి మంచి బ్యాట్స్… -
IND vs WI: ఐపీఎల్లో ఆడలేదని.. ఆ ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేయలేదు- వసీం జాఫర్
ఐపీఎల్లో ఆడలేదని అభిమన్య ఈశ్వరన్, ప్రియాంక్ పంచల్ లకు వెస్టిండీస్ టూర్ లో చోటు దక్కలేదని భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఆరోపించారు. దేశవాళీ క్రికెట్లో వారు అద్భుత ప్రదర్శన చేస్తున్నారని వసీం తెలిపాడు. అయితే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత వన్డే, టెస్టు జట్టును నిన్న ప్రకటించారు. ఇప్పుడు జట్టు ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు.. సెహ్వాగ్ ను అధిగమించి టాప్ 5లోకి ఎంట్రీ
టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో ఓపెనర్ గా అత్యధిక పరుగులు చేసిన ఐదవ ఆటగాడిగా వార్నర్ రికార్డ్ నెలకొల్పాడు. -
Ashes 2023: టెస్ట్ క్రికెట్ చరిత్రలో జో రూట్ అరుదైన రికార్డు..!
ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య ఎడ్జ్ బాస్టన్ వేదికగా యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన రూట్.. రెండో ఇన్నింగ్స్ లో 46 పరుగులు చేసి స్టంపౌట్ గా పెవిలియన్ చేరాడు. జో రూట్ స్టంపౌట్ అవ్వడం ద్వారా రికార్డ్ నెలకొల్పాడు. కెరీర్ లో 130 టెస్టులు ఆడిన రూట్ స్టంపౌట్ అవ్వడం ఇదే తొలిసారి. దాంతో కెరీర్ లో 11,168 రన్స్ చేసిన తర్వాత స్టంపౌట్… -
UEFA EURO Qualifiers: 3-0తో బోస్నియా అండ్ హెర్జెగోవినాను ఓడించిన పోర్చుగల్
బెన్ఫికా స్టేడియంలో ఆదివారం జరిగిన UEFA యూరో క్వాలిఫయర్స్‌లో పోర్చుగల్ 3-0తో బోస్నియా అండ్ హెర్జెగోవినాను ఓడించింది. ప్రస్తుతం ఈ గెలుపుతో పోర్చుగల్ తొమ్మిది పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంది. మూడు గేమ్‌లు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించింది.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..