UEFA EURO Qualifiers: బెన్‌ఫికా స్టేడియంలో ఆదివారం జరిగిన UEFA యూరో క్వాలిఫయర్స్‌లో పోర్చుగల్ 3-0తో బోస్నియా అండ్ హెర్జెగోవినాను ఓడించింది. ప్రస్తుతం ఈ గెలుపుతో పోర్చుగల్ తొమ్మిది పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంది. మూడు గేమ్‌లు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించింది. మరోవైపు స్లోవేకియా, లక్సెంబర్గ్, ఐస్‌లాండ్, లీచ్‌టెన్‌స్టెయిన్ మరియు బోస్నియా మరియు హెర్జెగోవినాతో పాటు పోర్చుగల్ గ్రూప్ Jలో ఉన్నాయి. ఫస్టాప్ లో డ్రాగా ముగిసినట్లు కనిపించినా.. 44వ నిమిషంలో పోర్చుగల్ ఆటగాడు బెర్నార్డో సిల్వా చేసిన గోల్ తన జట్టుకు ఒక గోల్ ఆధిక్యాన్ని అందించింది.
Read Also: Tamil Nadu: పట్టపగలు నడిరోడ్డుపై దారుణంగా చంపారు.. వీడియో
సెకండాఫ్ లో పోర్చుగల్ ఆటగాడు బ్రూనో ఫెర్నాండెజ్ మ్యాచ్ 77వ నిమిషంలో గోల్ చేయడంతో పోర్చుగల్ మ్యాచ్‌లో మరింత ముందుకుపోయింది. మ్యాచ్ 93వ నిమిషంలో బ్రూనో ఫెర్నాండెజ్ తన రెండో గోల్‌ను సాధించి.. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ 3-0తో సునాయాసంగా గెలిచింది. పోర్చుగల్ 10 షాట్‌లను టార్గెట్ చేయగా.. అందులో ఐదు షాట్‌లను విజయవంతంగా ముగించారు. మరోవైపు యూఈఎఫ్ఏ యూరో క్వాలిఫయర్స్‌లో బుధవారం ఐస్‌లాండ్‌తో పోర్చుగల్ తలపడనుంది.
Read Also: Raviteja: స్పీడుమీదున్న మాస్ మహారాజ.. ‘సితార’కి గ్రీన్ సిగ్నల్?
మ్యాచ్ తర్వాత పోర్చుగల్ మేనేజర్ రాబర్టో మార్టినెజ్ మాట్లాడుతూ.. మేము మ్యాచ్ పట్ల చాలా కృషి చేశాం. ఆటగాళ్ళు కష్టపడి పనిచేసి యూనిట్‌గా ఉన్నారు. మేము కష్టమైన క్షణాలలో ఏమి చేసామో, అదే ఈ రోజు ఫలితాన్ని ఇచ్చింది. మొత్తంమీద, ఈ మ్యాచ్ గెలవడం పట్ల మా ఆటను మెరుగుపరుచుకున్నట్లు తెలిపారు.