AFG vs BAN: బంగ్లాదేశ్ బౌలర్లను కడిగి ఆరేసిన 21 ఏళ్ల బ్యాట్స్‌మెన్లు.. సెంచరీలతో దుమ్మురేపారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్థాన్ జట్టు స్పిన్ బౌలింగ్‌కు చాలా ఫేమస్ అని క్రికెట్ ఫ్యాన్స్ కు తెలిసిన విషయమే. ఈ జట్టులో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ వంటి బౌలర్లు.. ఎలాంటి బ్యాట్స్‌మెన్‌నైనా ఇబ్బంది పెట్టగలరు. అయితే శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో అఫ్గానిస్థాన్ బ్యాట్స్‌మెన్లు తమ సత్తా చాటుతూ భారీ స్కోరు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ 9 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. ఓపెనింగ్ జోడీ రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ నిలకడగా ఆడి భారీ స్కోరు దిశగా తీసుకెళ్లారు. అంతేకాకుండా ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు సెంచరీలు చేసి రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ 21 ఏళ్ల యువకులిద్దరూ బంగ్లాదేశ్ బౌలర్లను భీకరంగా చిత్తు చేసి పరుగులు రాబట్టారు.
Maharashtra Leaders: సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు
Also Read
ఈ ఆఫ్గాన్ బ్యాట్స్ మెన్లు ఇద్దరు తమ జట్టులో ఎన్నో రికార్డులు సృష్టించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 256 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి వన్డేల్లో ఏ వికెట్‌కైనా ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. ఇంతకు ముందు ఈ రికార్డు మహమ్మద్ షాజాద్ మరియు కరీమ్ సాదిక్ పేరిట ఉంది. వీరు 16 ఆగస్టు 2010న స్కాట్లాండ్‌పై రెండవ వికెట్‌కు 218 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ChatGPT: అన్ని లోకల్ లాంగ్వేజ్ లోకి చాట్ జీపీటీ..
ఈ మ్యాచ్‌లో గుర్బాజ్ 125 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 8 ఫోర్లతో 145 పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి వన్డేల్లో ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. గతేడాది నవంబర్‌లో శ్రీలంకపై 162 పరుగుల ఇన్నింగ్స్‌తో జద్రాన్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. జద్రాన్ కూడా ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను 119 బంతులు ఎదుర్కొని 100 పరుగులు చేశాడు. అయితే అఫ్గానిస్తాన్ బ్యాటింగ్ లో వీరిద్దరూ తప్ప మరే బ్యాట్స్‌మెన్ ఎక్కువగా ఆడలేదు. వీరిద్దరూ కాకుండా మరేవెరైనా బ్యాట్స్‌మెన్ వేగంగా ఇన్నింగ్స్ ఆడి ఉంటే అఫ్గానిస్థాన్ స్కోరు మరింత పెరిగి ఉండేది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!