భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అనగానే క్రికెట్ అభిమానులకు పండుగే. ఎందుకంటే ఆ జట్ల మధ్య మ్యాచ్ అట్లుంది గనుక. అంతేకాకుండా భారత్, పాక్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా అది చాలా కాలం అందరి మనస్సుల్లో మెదులుతూనే ఉంటుంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను భారత్ ఓడించిన తీరును ఇంకెవరూ మరిచిపోరు. ఆ విజయం విరాట్ కోహ్లీ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ గా చెబుతారు. అంతేకాకుండా పాకిస్థాన్‌పై భారత్ సాధించిన అద్భుతమైన విజయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే మ్యాచ్. ఆ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ ఆడిన ఆటతీరును క్రికెట్ అభిమానులు ఎవరూ మర్చిపోరు. అయితే ఇప్పుడు కోహ్లీ ఆ మ్యాచ్ లో ఆడిన తీరును స్ఫూర్తిగా తీసుకుని ఎమర్జింగ్ ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో తలపడేందుకు భారత్-ఎ ఆటగాళ్లు సిద్ధమయ్యారు.
YSRCP: పిల్లి సుభాష్ చంద్రబోస్‌పై సీఎం సీరియస్.. ఇది తగునా..!
రేపు(బుధవారం) ఎమర్జింగ్ ఆసియా కప్‌లో భాగంగా.. భారత్-ఎ, పాకిస్థాన్-ఎ జట్లు తలపడనున్నాయి. ఎప్పుడైతే భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఉంటుందో.. ప్రపంచ దేశాల చూపు ఆ మ్యాచ్‌పైనే ఉంటుంది. ఈసారి కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. జూనియర్ జట్ల మ్యాచ్ అయినా.. అందరి దృష్టి ఈ మ్యాచ్ పైనే ఉంది. మ్యాచ్‌కు ముందు జట్టులోని ప్రధాన బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన అభిషేక్ శర్మ విరాట్ ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకున్నారు. బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ తన ట్విట్టర్‌లో అభిషేక్ చెప్పిన వీడియోను అప్‌లోడ్ చేసింది.
Amazon Layoffs: అమెజాన్‌లో మళ్లీ ఊడుతున్న ఉద్యోగాలు..ఉద్యోగుల్లో టెన్షన్..
టీ20లో విరాట్ ఇన్నింగ్స్ అత్యుత్తమ ఇన్నింగ్స్ అని అభిషేక్ చెప్పారు. ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోతుందని అందరూ భావించారని.. అయితే విరాట్ మాత్రం మ్యాచ్‌ను మలుపు తిప్పాడన్నారు. రియాన్ పరాగ్ కూడా కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. తన స్నేహితులతో కలిసి ఆ మ్యాచ్‌ని చూస్తున్నానని.. విరాట్ బాడీ లాంగ్వేజ్ చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు. ఆ మ్యాచ్‌లో.. పాక్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్‌పై ముందు వైపు కోహ్లీ అద్భుతమైన షాట్ ఆడి సిక్సర్ కొట్టాడని తెలిపాడు. ఆ షాట్‌ను టీ20లోని అత్యుత్తమ షాట్‌లలో ఐసీసీ కూడా పరిగణించింది. సాయి సుదర్శన్ కూడా ఆ షాట్‌ను గుర్తు చేసుకున్నారు. ఆ షాట్ సూపర్ హ్యూమన్ షాట్ అని సుదర్శన్ తెలిపారు.
.@IamAbhiSharma4, @sais_1509 & others talk about @imVkohli's historic innings 🆚 🇵🇰 in the #T20WC2022. Supernatural & awe-inspiring, they hope to emulate his energy!#Cricket #EmergingAsiaCupOnStar pic.twitter.com/6Pha7CEQWs
— Star Sports (@StarSportsIndia) July 18, 2023