IND W vs BAN W : నాలుగు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ మైదానంలోకి దిగిన భారత మహిళా క్రికెట్ జట్టు అనుకున్నట్టుగానే విజయాన్ని నమోదు చేసింది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో టీమిండియా మహిళల జట్టు విజయం సాధించింది. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టి20లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 115 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భారత్.. 16.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 118 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (35 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. స్మృతి మంధాన (34 బంతుల్లో 38; 5 ఫోర్లు) రాణించింది. వీరిద్దరి భాగస్వామ్యం టీమిండియాకు విజయాన్ని అందించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో సుల్తానా ఖాటున్ 2 వికెట్లు తీసింది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టి20 జూలై 11న జరగనుంది.
Vizag Minor Girl Case: విశాఖలో దారుణం.. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు
ఐతే భారత్ బ్యాటింగ్ లో జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. షఫాలీ వర్మ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరుకుంది. కాసేపటికే జెమీమా రోడ్రిగ్స్ (11) కూడా అవుటైంది. దాంతో భారత్ 21 పరుగులకే రెండు వికెట్లు నష్టపోయింది. ఈ దశలో జట్టును కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన రాణించారు. మూడో వికెట్ కు 70 పరుగులు జోడించిన తర్వాత స్మృతి మంధాన అవుటైంది. అయితే మరో ఎండ్ లో ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాట్ మ్యాచ్ ను గెలిపించింది.
MLC Kavitha: మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత
అంతకుముందు మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 114 పరుగులు చేసింది. షోర్ణ అక్తర్ (28 నాటౌట్; 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ గా నిలిచింది. శోబన (23), శత్తి రాణి (22) పరుగులు చేశారు. ఈ ముగ్గురు తప్ప మిగిలిన ప్లేయర్లు విఫలం అయ్యారు. ఇక భారత బౌలర్లలో పుజా వస్త్రాకర్, మిన్ను మని, షఫాలీ వర్మలు తలా ఒక వికెట్ తీశారు.