ఇండియా ఓపెన్-2022 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మలేషియా షట్లర్ జీయాంగ్‌పై భారత షట్లర్ లక్ష్యసేన్ విజయం సాధించాడు. తొలి సెట్ ఓడిపోయినా ఆ తర్వాత రెండు, మూడు సెట్లలో సాధికారికంగా ఆడి లక్ష్యసేన్ గెలుపొందాడు. జీయాంగ్‌పై 19-21, 21-16, 21-12 స్కోరు తేడాతో లక్ష్యసేన్ విజయం సాధించి ఫైనల్ చేరుకున్నాడు. కాగా టైటిల్‌పోరులో సింగపూర్‌కు చెందిన ప్రపంచ ఛాంపియన్ లోహ్ కియాన్యూతో లక్ష్యసేన్ తలపడనున్నాడు. లక్ష్యసేన్ ఉత్తరాఖండ్‌కు…
భారత బ్మాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు మరోసారి అదరగొట్టింది. ఇండియన్ ఓపెన్-2022లో భాగంగా క్వార్టర్ ఫైనల్లో అశ్మిత చలిహా క్రీడాకారిణిని వరుసగా రెండు సెట్లలోనూ పీవీ సింధు ఓడించింది. తొలి సెట్లో 21-7 తేడాతో, రెండో సెట్లో 21-18 పాయింట్ల తేడాతో పీవీ సింధు విజయం సాధించింది. ఈ క్వార్టర్స్ గెలుపుతో పీవీ సింధు సెమీస్ బెర్తును సొంతం చేసుకుంది. Read Also: కేప్‌టౌన్ టెస్టులో టీమిండియా ఓటమి.. సిరీస్ సమర్పయామి అంతకుముందు మ్యాచ్‌లో ఏరా…
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా మార్కరమ్ (7) వికెట్ కోల్పోయి 35 పరుగులు చేసింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ 11, కీగన్ పీటర్సన్ 14 క్రీజులో ఉన్నారు. అంతకుముందు టీమిండియా 202 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై బ్యాటింగ్ చేసేందుకు తడబడింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (50), రవిచంద్రన్ అశ్విన్ (46)…
సెంచూరియన్ : సెంచురియన్ భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్టులో భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో కేవలం 174 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తద్వారా దక్షిణాఫ్రికా ముందు 305 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. అత్యధికంగా రిషబ్ పంత్ 34 పరుగులు చేశాడు. Read Also: విశాఖలోనూ న్యూయర్ వేడుకలపై ఆంక్షలు: మనీష్ కుమార్ సిన్హా సౌతాఫ్రికా బౌలర్లలో రబాడా, మార్కో జాన్సెన్ లు చెరో 4 వికెట్లు తీశారు. లుంగి ఎంగిడి 2 వికెట్లు…
విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్‌ప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక్కడి సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో తమిళనాడుతో జరిగిన ఫైనల్లో 11 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఓపెనర్ శుభమ్ అరోరా అజేయ సెంచరీ (136)తో అదరగొట్టాడు. ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. అమిత్ కుమార్ 74, కెప్టెన్ రిషి ధవన్ 42 (నాటౌట్) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు 49.4 ఓవర్లలో…
దక్షిణాఫ్రికా గడ్డపై కెప్టెన్ కోహ్లీ నుంచి తాను ఒక గొప్ప సిరీస్ ను కోరుకుంటున్నానని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అన్నారు. కోహ్లీ ఒక అద్భుతమైన ఆటగాడే కాకుండా, గొప్ప కెప్టెన్ అని కితాబిచ్చారు. టెస్టుల్లో మన జట్టు పురోగతిని కొనసాగించాలని తాము భావిస్తున్నామని చెప్పారు. జట్టు పురోగతిలో కోహ్లీ పోషించిన పాత్ర గొప్పదన్నారు. టెస్టు క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే ఆటగాళ్లలో కోహ్లీ ఒక్కడని చెప్పారు. ఈ టెస్ట్ సిరీస్‌లో కూడా కోహ్లీ అద్భుతంగా రాణిస్తాడనే…
టీమిండియాకు దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. సచిన్, గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్, ధోనీ వంటి దిగ్గజాల నేతృత్వంలో కూడా భారత్ టెస్ట్ సిరీస్ సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు టీమిండియాను సువర్ణావకాశం ఊరిస్తోంది. ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటే ఈసారి సిరీస్ సాధించొచ్చని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా ఆడిన మూడు టెస్టుల్లో ఒక్కసారి మాత్రమే 250 ప్లస్ స్కోరు చేసిందని.. అందుకే ఆ సిరీస్…
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(BWF) అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా పీవీ సింధు మరోసారి ఎన్నికైంది. ఈ విషయాన్ని స్వయంగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రకటించింది. పీవీ సింధుతోపాటు మరో ఐదుగురిని బ్యాడ్మింటన్ వరల్డ్ అథ్లెట్స్ కమిషన్ సభ్యులుగా నియమించినట్లు BWF ప్రకటించింది. ఈ ఆరుగురు 2025 వరకు కొనసాగనున్నట్లు తెలిపింది. Read Also: వైరల్: వధూవరుల డ్యాన్స్… మధ్యలో అనుకోని అతిధి రావడంతో… కొత్త నియామకం…
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించిన ఆసీస్… రెండో టెస్టులోనూ ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 473/9 డిక్లేర్డ్ భారీ స్కోరు చేసింది. లబుషేన్ (103), కెప్టెన్ స్మిత్ (93) రాణించారు. బెన్ స్టోక్స్ 3 వికెట్లు సాధించాడు. అయితే బదులుగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ టీమ్ 236 పరుగులకే ఆలౌటైంది. రూట్ (62), మలాన్…
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో ఈరోజు బిగ్ మ్యాచ్ జరగనుంది. రౌండ్ రాబిన్ లీగ్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 9-0 తేడాతో గెలిచిన భారత్.. పాకిస్థాన్‌తోనూ అదిరిపోయే ఆటతో ఆకట్టుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. Read Also: కోహ్లీ వ్యాఖ్యలపై ‘మేం చూసుకుంటాం’ అని స్పందించిన దాదా 2018 మస్కట్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్స్…