Neeraj Chopra: డైమండ్ లీగ్‌లో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neeraj Chopra: భారత స్టార్ జావెలిన్ త్రో ఆటగాడు, ఒలింపిక్ ఛాంపియన్ 24 ఏళ్ల నీరజ్ చోప్రా ప్రఖ్యాత డైమండ్ లీగ్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణ పతకం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా నీరజ్ చోప్రా నిలిచాడు. స్విట్జర్లాండ్‌లోని సుసానెలో జరుగుతున్న డైమండ్ లీగ్‌లో మొదటి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.08 మీటర్ల దూరం విసిరి అందరికంటే ముందంజలో నిలిచాడు. రెండో ప్రయత్నంలో 85.18 మీటర్ల దూరం వేశాడు. మూడో ప్రయత్నంలో నీరజ్ చోప్రా ఈటెను విసరలేదు. నాలుగో ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. ఇక చివరి ప్రయత్నంలో 80.04 మీటర్లు మాత్రమే విసరగలిగాడు.
Read Also: Ban Sale Of Petrol-Powered Cars: పెట్రోల్ కార్లపై నిషేధం..! ఎప్పటి నుంచి అమలంటే..?
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
అయితే నీరజ్ చోప్రా కంటే ఎక్కువ దూరం ఎవరూ వేయకపోవడంతో అతడు తొలి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. దీంతో సెప్టెంబర్ 7, 8 తేదీల్లో జరుగనున్న జ్యూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. అంతేకాకుండా వచ్చేఏడాది బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్ బెర్తు కూడా నీరజ్ చోప్రా ఖరారు చేసుకున్నాడు. కాగా తన ప్రదర్శన పట్ల నీరజ్ చోప్రా సంతృప్తిని వ్యక్తం చేశాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఇలాంటి ఫలితం రావడం ఆనందంగా ఉందన్నాడు. గాయం వల్ల కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనలేకపోయానని.. కానీ ఈ రిజల్ట్ తన ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచిందని పేర్కొన్నాడు. జ్యురిచ్‌లో జరిగే ఫైనల్‌లో అత్యుత్తమంగా రాణిస్తానన్న నమ్మకం వచ్చిందని తెలిపాడు.
Tokyo Olympics gold medallist Neeraj Chopra becomes the first Indian to clinch the Lausanne Diamond League with a best throw of 89.08m.
(File photo) pic.twitter.com/tNX3HA1Zvk
— ANI (@ANI) August 27, 2022
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు