ఐపీఎల్ మెగా వేలంలో సురేష్ రైనాను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. గత 14 ఏళ్లుగా రైనా చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఆడి ఎన్నో విజయాలను ఒంటిచేత్తో అందించాడు. ఈ నేపథ్యంలో రైనాను తీసుకోకపోవడంపై సీఎస్కే అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టులతో తమ బాధను వెళ్లగక్కుతున్నారు. కరోనా కారణంగా 2020 సీజన్లో రైనా ఆడకపోయినా 2021 సీజన్లో అంచనాల మేరకు రాణించలేకపోయాడు. అయితే ఒక సీజన్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని అతడిని వేలంలో కొనుగోలు…
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సర్వ దర్శనం టోకెన్ల జారీ ప్రారంభం అయింది. తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్,శ్రీనివాసం,గోవిందరాజ సత్రాల వద్ద టోకెన్లు జారీచేస్తోంది టీటీడీ. రోజుకి 15 వేల చొప్పున టోకెన్లు ఇస్తోంది. నిరంతరం కొనసాగనుంది టోకెన్ల జారీప్రకియ. కరోనా కారణంగా సర్వదర్శనం టోకెన్లు జారీ నిలిపివేశారు. తాజాగా ఆ ప్రక్రియ ప్రారంభం కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలోని శ్రీకాళహస్తి ఆలయం మహాశివరాత్రి మహోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈనెల 24 వతేదీ నుండి శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా మోలో డింగా ఆదివారం దిల్లీలో సమావేశమయ్యారు. భారత్-కెన్యాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మోదీ ఆయనకు హామీ ఇచ్చారు. ఇరుదేశాల నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఏపీ హైకోర్టులో ఉదయం 10:30 గం.లకు ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. న్యాయమూర్తులచేత ప్రమాణం చేయించనున్నారు సీజే జస్టిస్ పీకే మిశ్రా. జస్టిస్ కొనకంటి శ్రీనివాస్ రెడ్డి, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ…
ఉత్తరాది గాన కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ ఇక లేరు. ఆమె వయసు 92 ఏళ్ళు. తీవ్ర అస్వస్థతతో గత కొన్నాళ్ళుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు లతా మంగేష్కర్. ఆసేతుహిమాచల పర్యంతం ఆబాలగోపాలాన్నీ అలరించిన గానకోకిల లతా మంగేష్కర్. ఆమె ఆకస్మిక మరణానికి యావత్ దేశం నివాళులర్పిస్తోంది. ప్రైవేటు వైద్య కళాశాలలు, డీమ్డ్ వర్సిటీల్లో రుసుములపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది జాతీయ వైద్య కమిషన్. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ…
వెస్టిండీస్ గడ్డపై జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో కుర్రాళ్లు అదరగొట్టడంతో…ఐదోసారి అండర్-19 ప్రపంచకప్ తన ఖాతాలో వేసుకుంది భారత్. ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. చివరగా యువ జట్టు 2018లో కప్పు గెలిచింది. ఇంగ్లాండ్‌తో ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్ వేదికగా శనివారం అర్ధరాత్రి ముగిసిన ఫైనల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన యువ భారత్.. 4 వికెట్ల తేడాతో గెలిచి ఐదోసారి విశ్వవిజేతగా నిలిచింది. 24 ఏళ్ల తర్వాత ఫైనల్‌కి చేరిన ఇంగ్లాండ్‌కి…
అంటిగ్వాలోని కూలిడ్జ్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఆ జట్టు ఫైనల్‌కు చేరడం వరుసగా ఇది నాలుగోసారి. కూలీస్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ , కెప్టెన్ యష్ ధుల్, షేక్ రషీద్ అద్భుతమైన భాగస్వామ్యంతో 290 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఆస్ట్రేలియా జట్టు 194 పరుగులకు పూర్తి 50 ఓవర్లు ఆడకుండానే పెవిలియన్…
స్వదేశంలో భారత్‌ను ఓడించడం అంతా సులభం కాదని, ప్రస్తుతం తమ జట్టుకు ఆ సత్తా ఉందని వెస్టీండిస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ అన్నారు. ఇటీవల ఐర్లాండ్ చేతిలో ఓడినా ఇంగ్లాండ్ పై తమ జట్టు అద్భుత విజయం సాధించి మళ్లీ ఫామ్‌లో కి వచ్చిందన్నారు. టీం ఇండియాతో 3 వన్డేలు, 3 టీ20లు ఆడేందుకు కీరన్ పొలార్డ్ సారథ్యంలోని వెస్టిండీస్ జట్టు నేడు భారత్‌కు రానుంది. ఈ నెల 6న తొలి వన్డే జరగనుంది. కాగా ఇప్పుడు…
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా ఆస్ట్రేలియాకు చెందిన ఆప్లే బార్టీ నిలిచింది. శనివారం మధ్యాహ్నం మెల్బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్లో అమెరికన్ ప్లేయర్ కొలిన్స్‌పై 6-3, 7-6 తేడాతో బార్టీ విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. తొలుత కొలిన్స్ ఓ బ్రేక్ పాయింట్ సాధించినా.. ఆ తర్వాత బార్టీ ఆధిపత్యం మొదలైంది. ఓ దశలో 1-5 తేడాతో వెనుకబడ్డ బార్టీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని విజయం వైపు అడుగులు…
ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ మ్యాచ్ మధ్యలో అంపైర్‌పై నోరు పారేసుకున్నాడు. ప్రత్యర్థి ఆటగాడు స్టెఫానో సిట్సిపాస్‌కు గ్యాలరీలో కూర్చున్న అతడి తండ్రి సలహాలు ఇస్తున్నాడని మెద్వెదెవ్ ఆరోపించాడు. నీకది కనిపించడంలేదా? నువ్వు మూర్ఖుడివా? అంటూ అంపైర్‌ను దుర్భాషలాడాడు. ఈ సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Read Also: టీమిండియా క్రికెటర్లకు షాక్.. ఈసారి ప్రత్యేక విమానాల్లేవ్..!! దీంతో రష్యా ఆటగాడు మెద్వెదెవ్ పై టోర్నీ…
ఐపీఎల్-15 సీజన్‌కు సమయం దగ్గర పడుతోంది. మార్చి నెలాఖరు నుంచే ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. అయితే ఇప్పటివరకు భారత్‌లోనే ఈ మెగా టోర్నీని నిర్వహిస్తామని బీసీసీఐ చెప్తున్నా.. కరోనా కేసుల నేపథ్యంలో దక్షిణాఫ్రికా లేదా దుబాయ్‌లో నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి తరుణంలో ఐపీఎల్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ మ్యాచ్‌లకు ఇంగ్లండ్ ఆటగాళ్లు దూరం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లను వేలంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తాయో లేదో అన్న…