BWF Championship 2022: 64 ఏళ్ల వయసులో కుమారుడితో కలిసి చరిత్ర సృష్టించిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BWF Championship 2022: వయసుతో ఆటకు సంబంధం లేదని మరోసారి రుజువైంది. ఇప్పటికే వయసు మళ్లిన వారు పలు క్రీడలలో రాణిస్తూ ఈ విషయాన్ని చాటిచెప్తున్నారు. తాజాగా ఓ మహిళ తన కుమారుడితో కలిసి చరిత్ర సృష్టించింది. టోక్యో వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్ 2022లో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.ఇజ్రాయెల్‌కు చెందిన స్వెత్లానా అనే 64 ఏళ్ల మహిళ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తొలి విజయాన్ని నమోదు చేసింది. BWF చరిత్రలో ఓ మ్యాచ్‌లో విజయం సాధించిన అత్యంత పెద్ద వయస్కురాలిగా స్వెత్లానా చరిత్ర సృష్టించింది. మరో విశేషం ఏమిటంటే.. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ఆమె కలిసి ఆడింది ఎవరితోనూ కాదు.. తన కొడుకు మిషా జిల్బర్‌మన్‌తోనే.
Read Also: KL Rahul Marriage: బాలీవుడ్ స్టార్ హీరో కుమార్తెతో కేఎల్ రాహుల్ పెళ్లి ఖరారు.. ఎప్పుడంటే..?
Also Read
- Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
- WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
- IND Vs WI 4th T20: ఉప్పల్‌లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
- Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్‌ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
మంగళవారం మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన స్వెత్లానా- మిషా జిల్బర్‌మన్ ద్వయం ఈజిప్ట్‌కు చెందిన దోహా హని-ఆడమ్ హాటెమ్ ఎల్గమల్ జోడిపై 16-21, 21-1, 21-11తో విజయం సాధించి ప్రి క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను తల్లీ కుమారులు చేజార్చుకున్నా మిగిలిన రెండు సెట్లలో ఆధిపత్యం ప్రదర్శించి సంచలన విజయం సాధించారు. కాగా ఇజ్రాయెల్‌కు చెందిన స్వెత్లానా గతంలోనే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇజ్రాయెల్ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో 17 సార్లు సింగిల్స్ విజేతగా.. మరో 21సార్లు మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆమె విజయాలు సాధించింది. అటు 64 ఏళ్ల వయసులో విజయం సాధించినందుకు స్వెత్లానాపై బీడబ్ల్యూఎఫ్ నిర్వాహకులు ప్రశంసలు కురిపించారు. 2009లో ఆమె బీడబ్ల్యూఎఫ్‌లో తొలి మ్యాచ్ ఆడిందని… 2022లో సాధించిన ఈ విజయం తమకు గర్వకారణమని బీడబ్ల్యూఎఫ్ నిర్వాహకులు ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
-
పండుగ వేళ టయోటా ధమాకా ఆఫర్.. Toyota Glanza Facelift విడుదల.. రూ. 6.99 లక్షల నుంచే ప్రారంభం..
-
Tollywood Star Daughters: కొడుకులే కాదు.. తండ్రుల లెగసీని మోస్తున్న టాలీవుడ్ వారసురాళ్లు..!
-
Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
-
CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్‌తోనే పోటిపడుతున్నాం..
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!