Team India: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా విజయం తర్వాత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. టీ20ల్లో 30 కంటే ఎక్కువ మ్యాచ్‌లలో అత్యధిక విన్నింగ్ పర్సంటేజీ కెప్టెన్సీ నమోదు చేసిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ 36 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించగా.. అందులో 30 మ్యాచ్‌లను భారత్ గెలుచుకుంది. కేవలం ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీ విన్నింగ్ పర్సంటేజీ 83.33గా నమోదైంది. దీంతో అత్యధిక విజయ శాతం ఉన్న టీమిండియా కెప్టెన్‌గా అతడు నిలిచాడు.
Read Also: Bhakthi TV 15th Anniversary Special Song: ఆకట్టుకుంటున్న ‘భక్తి టీవీ’ వార్షికోత్సవం పాట..
టీ20ల్లో తమ జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌ల జాబితాలో రెండో స్థానంలో ఆప్ఘనిస్తాన్ కెప్టెన్ అష్ఘర్ ఆఫ్గాన్ ఉన్నాడు. అతడు 80.8 శాతం విన్నింగ్ పర్సంటేజీని కలిగి ఉన్నాడు. 62.5 శాతం విన్నింగ్ పర్సంటేజీతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. 59.2 శాతం విన్నింగ్ పర్సంటేజీతో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఉన్నాడు. 58.6 శాతం విన్నింగ్ పర్సంటేజీతో ఎంఎస్ ధోనీ, 55.6 శాతం విన్నింగ్ పర్సంటేజీతో ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్, 51.7 శాతం విన్నింగ్ పర్సంటేజీతో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఉన్నాడు.
Win% of T20I Captains with 30 or more Wins
83.3% Rohit Sharma
80.8% Asghar Afghan
62.5% Virat Kohli
59.2% Eoin Morgan
58.6% MS Dhoni
55.6% Aaron Finch
51.7% Kane Williamson#RohitSharma | #AsiaCup | #Hitman— Cricbaba (@thecricbaba) August 29, 2022