క్రికెట్లో పసికూన ఆఫ్ఘనిస్థాన్ సంచలనం సృష్టించింది. అండర్-19 ప్రపంచకప్‌లో తొలిసారి సెమీఫైనల్ పోటీలకు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో గురువారం నాడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని ఆఫ్ఘనిస్థాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు రాణించడంతో 135 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కేవలం 130 పరుగులకే పరిమితమైంది. Read Also: ప్రతి జట్టులో ధోనీ లాంటోడు ఉండాలి.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ప్రశంసలు ఈ మ్యాచ్‌లో…
గతేడాది సీజన్లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురస్కారాలు ప్రకటించింది. 2021 సీజన్ కోసం ప్రకటించిన ఈ వార్షిక అవార్డుల్లో పాకిస్థాన్ ఆటగాళ్ల హవా స్పష్టమైంది. ఏకంగా నాలుగు అవార్డులను కొల్లగొట్టారు. 2021లో అత్యుత్తమ టీ20 ఆటగాడిగా మహ్మద్ రిజ్వాన్ ఎంపిక కాగా, వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా కెప్టెన్ బాబర్ అజామ్ నిలిచాడు. బాబర్ గతేడాది 6 వన్డేల్లో 67.50 సగటుతో 405 పరుగులు సాధించాడు. వాటిలో…
భారత్‌తో జరుగుతున్న నామమాత్రపు చివరి వన్డేలో దక్షిణాఫ్రికా దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ శతకంతో అదరగొట్టాడు. 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో జట్టు భారాన్ని తన భుజాలపై వేసుకున్న డికాక్.. సంయమనంతో ఆడుతూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న డికాక్.. అదే ఊపుతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 108 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో…
ప్రపంచ క్రికెట్ అభిమానుల ఫేవరెట్ లీగ్ ఐపీఎల్ ఇంకో రెండు నెలల్లో మొదలు కానుంది. ఐపీఎల్ 15వ సీజన్‌ను ఈ ఏడాది కాస్త ముందుగానే.. అంటే మార్చి నెలాఖరులోనే ప్రారంభించడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ధ్రువీకరించారు. స్వదేశంలోనే ఐపీఎల్ నిర్వహించేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని… కరోనా కేసులు అదుపులోకి రాని పక్షంలో లీగ్‌ను మరోసారి విదేశానికి తరలించక తప్పదన్నారు. భారత్‌లోనే లీగ్ జరగాలని అన్ని ఫ్రాంచైజీల యజమానులు…
సఫారీల చేతిలో భారత్‌కు ఓటమి తప్పలేదు. తొలి వన్డేలో 297 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 31 పరుగుల తేడాతో సఫారీలు ఘన విజయం సాధించారు. ఫలితంగా 3 వన్డేల సిరీస్‌లోదక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో ఉంది. కోహ్లీ 51, శిఖర్ ధావన్ 79, శార్దుల్ ఠాకూర్ రాణించారు. అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన తొలుత తడబడ్డ తర్వాత…
సౌతాఫ్రికా, ఇండియా మధ్య జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాట్స్మెన్లు అద్భుతంగా రాణించారు. భాతర బౌలర్లను ఎదుర్కొంటు సులవుగా బౌండరీల మీద బౌండరీలు బాదారు. సౌత్ ఆఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 296 పరుగులు చేసింది. దీంతో భారత్ ఈ వన్డే లో విజయం సాధించాలంటే 297 పరుగులు చేయాల్సి ఉంటుంది. కాగా సౌతాఫ్రికా బ్యాట్స్మెన్లు ఇద్దరూ సెంచరీ నమోదు చేశారు. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బావుమా 110 (143) పరుగులను 8 ఫోర్లు…
ఐర్లాండ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్ గడ్డపై ఆశ్చర్యకర రీతిలో వన్డే సిరీస్ విజయాన్ని సాధించింది. సబీనా పార్కులో ఆదివారం రాత్రి జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్‌పై రెండు వికెట్ల తేడాతో ఐర్లాండ్ గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో వెస్టిండీస్ గెలవగా… రెండు, మూడు వన్డేల్లో ఐర్లాండ్ గెలిచి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. తద్వారా విదేశీ గడ్డపై తొలిసారి ఐర్లాండ్ వన్డే సిరీస్ గెలిచింది. Read Also: ఐపీఎల్ 2022:…
భారత యువ షట్లర్ లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. ఇండియా ఓపెన్ 2022లో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సింగపూర్ ఆటగాడు, వరల్డ్ ఛాంపియన్ లొహ్ కియన్ యూని 24-21, 21-17 స్కోరు తేడాతో ఓడించాడు. లక్ష్యసేన్‌కు ఇదే తొలి టైటిల్. అంతేకాకుండా ఈ టైటిల్‌ను గెలుచుకున్న మూడో భారత పురుష ఆటగాడిగా లక్ష్యసేన్ నిలిచాడు. అతని కంటే ముందు 1981లో ప్రకాష్ పదుకొణె, ఆ తర్వాత 2015లో కిదాంబి శ్రీకాంత్ తొలి సూపర్ 500 ఛాంపియన్షిప్ టైటిల్‌ను…
ప్రపంచ అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు జకోవిచ్‌కు ఆస్ట్రేలియా కోర్టు షాకిచ్చింది. తన వీసాను పునరుద్ధించుకోవడానికి జకోవిచ్ ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టును ఆశ్రయించగా… అక్కడ చుక్కెదురైంది. కరోనా వ్యాక్సిన్ తీసుకోకుండా జకోవిచ్ ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టేందుకు ప్రయత్నించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో జకోవిచ్ వీసాను ఆస్ట్రేలియా ప్రభుత్వం రద్దు చేయడం సబబేనని కోర్టు ఏకీభవించింది. జకోవిచ్‌ను ఆస్ట్రేలియా నుంచి తిప్పిపంపాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఫెడరల్ కోర్టు మద్దతు పలికింది. Read Also: అది కోహ్లీ…
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. మరోసారి టైటిల్ గెలిచే అవకాశాన్ని పీవీ సింధు చేజార్చుకుంది. శనివారం జరిగిన సెమీస్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన సుపానిడా కటేథాంగ్ చేతిలో సింధు ఓటమిపాలైంది. 14-21, 21-13, 10-21 స్కోరు తేడాతో మ్యాచ్ కోల్పోయింది. దీంతో ఇండియా ఓపెన్ టోర్నీ టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది. Read Also: బిగ్ బ్రేకింగ్: టెస్ట్ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై..!! కాగా శుక్రవారం జరిగిన క్వార్టర్…