PM Modi Appreciates Neeraj chopra: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్తో సత్తా చాటిన నీరజ్ చోప్రాపై ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రశంసల వర్షం కురుస్తోంది. నీరజ్ చోప్రా విజయాన్ని పురస్కరించుకుని అతడి స్వగ్రామమైన హర్యానాలోని పానిపట్లో కుటుంబసభ్యులు, స్నేహితులు డ్యాన్సులు చేశారు. మరోవైపు నీరజ్ చోప్రాకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. భారత ఖ్యాతిని నీరజ్ నిలబెట్టాడని, గర్వంగా ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారత అత్యున్నత అథ్లెట్లలో నీరజ్ ఒకడని…
bcci introduced new category for umpires: అంపైర్ల కోసం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అంపైరింగ్లో సమర్ధత ఆధారంగా నాలుగు కేటగిరీలు ఉండేవి. ఉత్తమ పనితీరు ఆధారంగా ‘ఏ’, ‘బి’, ‘సి’, ‘డి’ కేటగిరీల ద్వారా అంపైర్లకు స్థానం కల్పించేవారు. అయితే కొత్తగా అంపైరింగ్ విధులను అత్యంత సమర్థతతో నిర్వర్తించే వాళ్ల కోసం బీసీసీఐ కొత్త కేటగిరీ ఏ+ ఏర్పాటు చేసింది. కొత్త కేటగిరి ఏ+లో 11 మంది అంపైర్లకు స్థానం కల్పించింది. ఈ…
అమెరికాలోని యుజీన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత లాంగ్ జంప్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ నిరాశ పరిచాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరిన భారత తొలి మేల్ లాంగ్ జంపర్గా చరిత్ర సృష్టించిన శ్రీ శంకర్ ఫైనల్గా పతకం మాత్రం అందుకోలేకపోయాడు. పురుషుల లాంగ్ జంప్ ఫైనల్లో శ్రీశంకర్ ఏడో స్థానంతో సరిపెట్టాడు. కనీసం క్వాలిఫికేషన్ రౌండ్లో అందుకున్న దూరాన్ని కూడా ఫైనల్లో అతడు చేరుకోలేకపోయాడు. ఫైనల్లో అన్ని ప్రయత్నాల్లో అత్యధికంగా 7.96…
రష్యాకు చెందిన టెన్నిస్ మాజీ స్టార్ మరియా షరపోవా మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పటివరకు షరపోవాకు పెళ్లి కాలేదు. అయితే ఆమె పెళ్లి కాకుండానే తల్లి కావడంతో ఆమె అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాబోయే భర్త అలెగ్జాండర్ గిల్క్స్తో కలిసి కొంతకాలంగా ఆమె సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె జూలై 1వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా షరపోవా ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. తమ బాబుకు థియోడర్ అని పేరు పెట్టినట్లు…
ఇంగ్లండ్తో ఇటీవల ముగిసిన మూడు టీ20ల సిరీస్ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చివరి టీ20లో మెరుపు సెంచరీతో వీరవిహారం చేసిన సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో ముందుకు దూసుకెళ్లాడు. 55 బంతుల్లోనే 117 పరుగులు చేసిన సూర్య తన కెరీర్లోనే బెస్ట్ ఐసీసీ ర్యాంకింగ్ నమోదు చేశాడు. టీ20ల ర్యాంకింగ్స్లో సూర్యకుమార్ ఐదో స్థానంలో నిలిచాడు. విశేషం ఏంటంటే.. టాప్ టెన్లో ఇండియా నుంచి ఉన్న…