Team India: ఈ బౌలింగ్, ఫీల్డింగ్‌లతో మనోళ్లు ప్రపంచకప్ గెలుస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: ఆస్ట్రేలియాతో మొహాలీలో జరిగిన తొలి టీ20 చూసిన తర్వాత టీమిండియా అభిమానులందరూ ఓ అంచనాకు వచ్చేసినట్లు కనిపిస్తోంది. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు టైటిల్ గెలిచేంత సీన్ అయితే లేదని పలువురు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. మొన్నటి వరకు టీ20ల్లో మన జట్టే తోపు అన్న ఫీలింగ్‌లో ఉన్న అభిమానులే ఇప్పుడు తమ మనసు మార్చుకున్నారు. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా ఉన్న మన జట్టు గురించి అంచనాలు పెట్టుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. కానీ ఆసియా కప్‌లో మనోళ్ల ప్రదర్శన చూసిన తర్వాత ఆశలు సన్నగిల్లాయి. దుబాయ్ వంటి దేశంలో బుమ్రా, హర్షల్ పటేల్, జడేజా వంటి బౌలర్లు లేకుండా ఎలా గెలుస్తాంలే అని చాలా మంది అనుకున్నారు. కానీ సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తొలి టీ20 చూసిన తర్వాత ప్రపంచకప్‌లో టీమిండియా ప్రయాణం ఎలా ఉండబోతుందన్న విషయంపై ఓ క్లారిటీ అయితే వచ్చేసిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచకప్‌లో గెలవాలంటే కేవలం బ్యాటింగ్‌లో రాణిస్తే సరిపోదు. బౌలింగ్, ఫీల్డింగ్‌లలో కూడా అత్యుత్తమ ప్రదర్శన చేయాలి. ఆస్ట్రేలియాలో వార్నర్, మిచెల్ మార్ష్, స్టాయినీస్, మిచెల్ స్టార్క్ వంటి ఆటగాళ్లు లేకపోయినా 209 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు ఛేదించింది. ఒకరకంగా ఇక్కడ ఆస్ట్రేలియా గెలిచిందని చెప్పడం కంటే టీమిండియా ఓడిందని చెప్పడమే సబబుగా ఉంటుంది. 208 పరుగులు చేసి కూడా ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేదంటే మనోళ్ల ప్రదర్శన గురించి ఏమని వివరించాలి. గ్రీన్, స్మిత్ లాంటి ఆటగాళ్లు ఇచ్చిన క్యాచ్‌లను కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ జారవిడవడం టీమిండియా విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది.
Also Read
- India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
- Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
అటు ఆసియా కప్ వైఫల్యాన్ని ప్రధాన బౌలర్ భువనేశ్వర్ కొనసాగించాడు. అసలు రోహిత్ కెప్టెన్సీ వ్యూహాలు అంతుబట్టకుండా ఉన్నాయి. భువీ, హర్షల్ పటేల్ లాంటి బౌలర్లు ధారాళంగా పరుగులు ఇస్తున్న సమయంలో ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాతో లేదా రెండు వికెట్లు తీసిన ఉమేష్‌కు బంతి ఇవ్వకపోవడం రోహిత్ కెప్టెన్సీపై అనుమానపు నీడలు కమ్మేలా చేస్తోంది. బౌలింగ్‌లో బుమ్రా ఉంటే మరోలా ఉండేదని మనం అనుకున్నా ప్రపంచకప్‌కు అతడు ఉంటాడన్న గ్యారంటీ అయితే ఇప్పటివరకు లేదు. అసలు ఫిట్‌గా లేని బుమ్రాను ప్రపంచకప్‌కు, ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేశారో సెలక్టర్లకే తెలియాలి. భారత బౌలర్లు డెత్ ఓవర్లు అయిన 17, 18, 19 ఓవర్లలో వరుసగా 15, 22, 16 పరుగులు సమర్పించుకున్నారు. ఈ మూడు ఓవర్లలో ఏ ఒక్క ఓవర్ కట్టడి చేసినా మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది. అయితే ఇలాంటి బౌలింగ్, ఫీల్డింగ్‌లతో భారత్ ప్రపంచ కప్ గెలవడం ముమ్మాటికీ అసాధ్యమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అటు బ్యాటింగ్‌లో టాపార్డర్ ప్రదర్శన కూడా గొప్పగా ఏమీ లేదు. టాప్-3లో కేవలం ఒక్క ఆటగాడే ఆడటం వల్ల ఉపయోగం లేదని టీమిండియా ఇప్పటికైనా గ్రహించాలి.
Rohit gave 19th over to Bhuvi
Indian Fans : pic.twitter.com/xNSrrviVo8— Aryan 🇮🇳 (@iAryan_Sharma) September 20, 2022
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..