మాజీ క్రికెటర్లు, అంపైర్ల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ఇచ్చే పెన్షన్లను పెంచుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ పెన్షన్ పెంపు పురుషులతో పాటు మహిళా మాజీ క్రికెటర్లకు కూడా వర్తిస్తుంది. కనిష్ఠంగా రూ.15వేలు ఉన్న పెన్షన్‌ను రూ.30 వేలకు బీసీసీఐ పెంచింది. అంతేకాకుండా గరిష్ఠంగా రూ.50 వేలు ఉన్న పెన్షన్‌ను రూ.70 వేలకు పెంచింది. ఆటగాళ్లకు కేటగిరీలుగా ఈ పెన్షన్ అందిస్తారు. తమ పెన్షన్లు పెంచాలని ఇండియన్ క్రికెటర్ అసోసియేషన్ (ICA) గత కొన్నాళ్లుగా…
ఇండోనేషియా మాస్టర్స్‌లో భారత షట్లర్లు నిరాశ పరిచారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయారు. ఫలితంగా ఈ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 12–21, 10–21తో ఎనిమిదో ర్యాంకర్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలైంది. 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏదశలోనూ పీవీ సింధు ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయింది. రచనోక్ చేతిలో సింధు ఇప్పటివరకు…
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈరోజు నుంచి ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే తొలి టీ20 జరిగే ఢిల్లీలో రాత్రిపూట కూడా వడగాలులు వీస్తున్నాయి. ఉదయం వేళల్లోనే ఢిల్లీలో ఉష్ణోగ్రత 36 నుంచి 38 డిగ్రీల వరకు ఉంటోంది. మధ్యాహ్నం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య గరిష్ఠంగా 43 నుంచి 44 డిగ్రీలను టచ్ చేస్తోంది.…
ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రేపటి నుంచి ఈ నెల 13 వరకు హర్యానాలోని పంచకులలో ప్రారంభం కానున్నాయి. 25 క్రీడావిభాగాల్లో మొత్తం 4,700 మంది అథ్లెట్లు పోటీ పడుతుండగా.. ఇందులో 2,262 మంది బాలికలు ఉన్నారు. అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ, హ్యాండ్‌బాల్, రెజ్లింగ్, వాలీబాల్, బాక్సింగ్‌తో పాటు ఇతర క్రీడలను ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో నిర్వహించనున్నారు. అంబాల, షాహాబాద్, చండీగఢ్, న్యూఢిల్లీలోని మైదానాల్లో ఈ గేమ్స్ జరగనున్నాయి. COMMONWEALTH…
ఐపీఎల్ 2022 సీజన్లో గత రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ మిని ఫైనల్ మ్యాచ్‌ను తలపించింది. అయితే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి 207 పరుగుల భారీ స్కోరును లక్నో ముందు ఉంచింది. గత మ్యాచ్‌లో మెరిసిన కోహ్లీ 25 పరుగులకే వెనుదిరిగాడు. కెప్టెన్ డుప్లెసిస్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు.…
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ విజేతగా భారత్ నిలిచింది. ఈ టోర్నీ ఫైనల్లో 52 కిలోల విభాగంలో థాయ్‌లాండ్ బాక్సర్ జిత్పోంగ్ జుటామాను ఓడించి తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. నిఖత్ జరీన్ నిజామాబాద్ వాసి. ఆమెకు 25 ఏళ్లు. తన కెరీర్లో తొలి ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ‘వరల్డ్ ఛాంపియన్షిప్’ బంగారు పతకాన్ని నిఖత్ జరీన్ గెలిచింది. భారత్ నుంచి గతంలో మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ.సి…
బాక్సింగ్ లోకం మరో మేటి స్టార్‌ను కోల్పోయింది. జర్మనీ స్టార్ బాక్సర్ ముసా యమక్ (38) గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. మునిచ్‌లో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే యమక్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆస్పత్రికి తరలించే లోపే అతడు మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. ఉగాండాకు చెందిన హమ్జా వండెరాతో జరుగుతున్న మ్యాచ్ సమయంలో మూడో రౌండ్‌కు ముందు రింగ్‌లోనే యమక్ కుప్పకూలాడు. IPL 2022: అరగంట ఆలస్యంగా ఫైనల్ మ్యాచ్.. ఎందుకంటే..? ఈ విషయాన్ని గమనించిన అక్కడి సిబ్బంది…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. జట్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతోంది. అయితే నేడు ముంబాయి డీవై పాటిల్ స్టేడియం వేదికగా.. పంజాబ్ కింగ్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ఎందుకంటే.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మాత్రమే ప్లే ఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటి…
ఐపీఎల్ సీజన్ 2022లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. అయితే.. నేడు ముంబాయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా.. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు పంజాబ్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరును ఆర్సీబీ ముందు పెట్టారు. 60 పరుగుల…
ఐపీఎల్ 2022 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్లో నువ్వా నేనా అనే విధంగా జట్లు పోటీ పడుతున్నాయి. అయితే ఈ సీజన్లో భాగంగా నేడు ఆసక్తికర పోరు జరుగుతోంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో లక్నో సూపర్ జెయింట్ తలపడుతోంది. అయితే టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకోగా రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లు బ్యాటింగ్‌కు దిగారు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఇరుజట్లు చెరో 6 మ్యాచ్‌లు ఆడి…