టాలెంట్ ఏ ఒక్కరి సొంతం కాదు. దానికి పేదవారు…ధనవంతులతో పని లేదు. పట్టుదల..కష్టపడే తత్వం ఉంటే చాలు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న జూనియర్ మహిళల హాకీప్రపంచకప్లో అద్భుతంగా ఆడుతున్న ముంతాజ్ కథ అలాంటిదే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముంతాజ్‌ది ఓ నిరుపేద కుటుంబం. ఆరుగురు అక్కా చెల్లెళ్లు..ఒక సోదరుడు. తండ్రి సంపాదన అంతంత మాత్రమే. కుటుంబం గడవటానికి తల్లి కైసర్ జహాన్ తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతుంది. శుక్రవారం దక్షిణ కొరియాపై ముంతాజ్ విజృంభించి ఆడుతున్న సమయంలో ..ఇక్కడ క్నోలోని…
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు శుభవార్త అందింది. ఈ జట్టు స్టార్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో పలు కారణాలతో తొలి మ్యాచ్ ఆడలేదు. అయితే అతడు గురువారం నాడు జట్టుతో చేరిపోయాడు. దీంతో శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పంజాబ్ కింగ్స్ ఆడనున్న మ్యాచ్‌లో బెయిర్ స్టో ఆడనున్నట్లు జట్టు యాజమాన్యం ధ్రువీకరించింది. ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్ పర్యటన సందర్భంగా బెయిర్ స్టో జట్టులో చేరడం ఆలస్యమైనట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఐపీఎల్లో మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని…
నేడు ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా కోల్కత్తా నైట్‌రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడేందుకు సిద్ధమైంది. ఈ సీజన్ తొలిమ్యాచ్‌లోనే ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఈ మ్యాచ్‌లో ఒత్తిడి పెరిగిందనే చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించి కేకేఆర్ జోష్‌లో ఉండగా.. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించి కూడా పరాజయం పాలైన…
ఐపీఎల్ 15వ సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ప్రారంభించింది. పటిష్ట ముంబై ఇండియన్స్ జట్టును 4 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ముంబై ఇండియన్స్ విధించిన 178 పరుగుల విజయలక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే ఉఫ్ మని ఊదేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా లలిత్ యాదవ్ (48 నాటౌట్), అక్షర్ పటేల్ (38 నాటౌట్) మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసి ఢిల్లీ జట్టును గెలిపించారు. దీంతో ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ బూడిద పాలైపోయింది. పృథ్వీ షా (38),…
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఖాతాలో మరో టైటిల్ చేరింది. స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీని పీవీ సింధు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్ క్రీడాకారిణి బుసానన్‌పై 21-16, 21-8 తేడాతో పీవీ సింధు విజయం సాధించింది. 49 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో పీవీ సింధు సంపూర్ణ ఆధిపత్యం చేలాయించింది. ఈ ఏడాది సింధు ఖాతాలో ఇది రెండో టైటిల్ విజయం. ఈ ఏడాది జనవరిలో సయ్యద్ మోదీ…
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు, టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2023 ఐపీఎల్ సీజన్‌కు ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ విరాట్ కోహ్లీ వ్యవహరిస్తాడని వెల్లడించాడు. తనపై ఒత్తిడి తగ్గించుకునేందుకు ఈ సీజన్‌కు విరాట్ కోహ్లీ చిన్న బ్రేక్ మాత్రమే తీసుకున్నాడని అశ్విన్ అన్నాడు. దీంతో అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మరోవైపు ఆర్సీబీ కొత్త కెప్టెన్‌గా డుప్లెసిస్‌ను ఎంపిక చేయడం మంచి పరిణామమని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.…
మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా పరిస్థితి డోలాయమాన స్థితిలో ఉంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే మంగళవారం నాటి బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అంతేకాకుండా ఈనెల 27న జరిగే దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లోనూ విజయం సాధించాలి. అప్పుడే భారత్ ప్రపంచకప్‌లో సెమీస్ చేరేందుకు అవకాశం ఉంటుంది. టీమిండియా సమస్య ఏంటంటే.. బ్యాటర్లు రాణిస్తున్నప్పటికీ బౌలర్లు మాత్రం పూర్తి స్థాయిలో రాణించడం లేదు. కాబట్టి విజయాల బాట పట్టాలంటే బౌలర్లు తమ బంతులకు…
వివిధ కారణాల వల్ల నాలుగేళ్లుగా నిర్వహించలేకపోయిన ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను తిరిగి ఈ ఏడాది ప్రారంభించాలని ఆసియా కప్ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. శ్రీలంక వేదికగా ఆగస్టు 27 నుంచి ఆసియా కప్‌ను నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆసియా కప్‌ను నిర్వహిస్తుండటంతో ఈసారి టీ20 ఫార్మాట్లో ఈ టోర్నీ జరగనుంది. ఆసియా కప్‌లో టీమిండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్ జట్లతో పాటు మరో టీమ్ కూడా పాల్గొననుంది.…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుపై కన్నేశాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో టీమిండియా ఆడబోతున్న తొలి టెస్టు విరాట్ కోహ్లీకి 100వ టెస్టు. కెరీర్లో వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ ఈ టెస్టులో మరో 38 పరుగులు చేస్తే టెస్టుల్లో 8వేల పరుగులు పూర్తి చేసిన ఆరో భారత ఆటగాడిగా అవతరిస్తాడు. గతంలో భారత్ తరఫున సచిన్ (15,921), ద్రవిడ్ (13,288), గవాస్కర్ (10,122), సెహ్వాగ్ (8,586), లక్ష్మణ్ (8,781) మాత్రమే…
ప్రొ.కబడ్డీ-8వ సీజన్ ఫైనల్ హోరాహోరీగా జరిగింది. ఈ మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ను 37-36 తేడాతో దబాంగ్ ఢిల్లీ చిత్తు చేసి తొలి టైటిల్‌ను చేజిక్కించుకుంది. టైటిల్ పోరులో దబాంగ్ ఢిల్లీకి పట్నా పైరేట్స్ గట్టి పోటీనే ఇచ్చింది. తొలి హాఫ్‌లో ఢిల్లీ 15 పాయింట్లు సాధిస్తే పట్నా ఏకంగా 17 పాయింట్లు సాధించింది. అయితే రెండో హాఫ్‌లో ఢిల్లీ శక్తిని కూడదీసుకుని టైటిల్‌ను చేజిక్కించుకుంది. దీంతో మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన పట్నా పైరేట్స్ ఒక…