బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి వైఫల్యంతో ఇండియా కూటమిలో కొత్త డిమాండ్ తెరపైకి వస్తోంది. అఖిలేష్ యాదవ్‌కు ఇండియా కూటమి బాధ్యతలు అప్పగించాలంటూ వాదన వినిపిస్తోంది.
Akhilesh Yadav: బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయం నమోదు చేసింది. 243 సీట్లు ఉన్న బీహార్‌లో ఏకంగా 200+ పైగా సీట్లను సాధించే దిశగా వెళ్తోంది. ఆర్జేడీ-కాంగ్రెస్-కమ్యూనిస్టుల కూటమి ‘‘మహాఘట్బంధన్’’ తుడిచిపెట్టుకుపోయింది. కేవలం 30 స్థానాల్లోనే ఆధిక్యత కనబరుస్తోంది.
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతాను సస్పెండ్ చేశారని ఆ పార్టీ నేత ఫక్రుల్ హసన్ చాంద్ తెలిపారు. అఖిలేష్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతాను నిలిపివేయడం ప్రజాస్వామ్యంపై దాడిగా రాసుకొచ్చారు.
Mayawati: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి గురువారం ప్రశంసలు కురిపించారు. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), తన ప్రభుత్వ హమాంలో నిర్మించిన సంస్థలు, దళిత స్మారక చిహ్నాల నిర్వహణ విషయంలో అఖిలేష్ యాదవ్ రెండు ముఖాలతో వ్యహరించారని విమర్శించారు.
లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వక్ఫ్ చట్టంపై పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన హింసను ప్రస్తావిస్తూ.. ప్రతిపక్షాలు హింసను ప్రేరేపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ముగ్గురు హిందువులను వారి ఇంటి నుంచి బయటకు లాగి దారుణంగా హత్య చేశారన్నారు. లక్నోలో బాబా సాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ సమ్మాన్ అభియాన్ కింద నిర్వహించిన రాష్ట్ర వర్క్‌షాప్‌లో బీజేపీ నాయకులను ఉద్దేశించి సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు.
రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య సన్నిహితురాలు లక్ష్మీ పడాల NTV తో మాట్లాడింది. ఆమెను శేఖర్ బాషా, ఓ పోలీసు అధికారి ట్రాప్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఆ అంశం మీద ఆమె స్పందించింది. ఓ కేసు విషయమై పోలీస్ అధికారి శ్రీనివాస్ ను కలిసానని పేర్కొన్న ఆమె ఓ అబ్బాయిని ఇష్టపడ్డాను కొన్ని సంఘటనలు జరిగాయి ఈ విషయమై ఎస్పీని కలవడానికి వెళ్లానన్నారు. అప్పటి నుంచి నా నెంబర్ తీసుకొని నన్ను వేధింపులకు…
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని టార్గెట్ చేస్తూ అనకాపల్లి ఎంపీ సిఎం రమేష్ నాయుడు లేఖ అస్త్రాన్ని సంధించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో అసాంఘిక కార్యక్రమాలు పేట్రేగిపోతున్నాయని వాటిని అడ్డుకోవలసిన అవసరం ఎంతైనా ఉందంటూ కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఎంపీ సిఎం రమేష్ నాయుడు లేఖలో కోరారు.
జేసీ వ్యవహారంలో తాడిపత్రి అర్బన్ సీఐ, ఓ వ్యక్తి మధ్య సాగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. వేరేవాళ్లతో ఫోన్ చేయించి జేసీ ప్రభాకర్‌రెడ్డి తనను బెదిరిస్తున్నాడన్న రాంపులయ్య అనే వ్యక్తి.. తనకు జేసీ ఫోన్ నంబర్ కావాలంటూ సీఐ సాయిప్రసాద్‌ను అడగడంతో.. ఇద్దరి మధ్య మాటామాట పెరిగిపోయింది.. చివరకు అసభ్యపదజాలంతో దూషించుకోవడం వరకు వెళ్లింది..
గత కొన్ని రోజులుగా బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేడ్కర్ పేరుతో రాజకీయ పోరాటం సాగుతోంది. పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా ప్రసంగంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, ఎస్పీ సహా పలు రాజకీయ పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ దీనిని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసుకుంది.
ఇండియూ కూటమిలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గత కొద్దిరోజులుగా నాయకత్వ మార్పుపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఇండియా కూటమి నాయకురాలిగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని నియమించాలంటూ కూటమిలోని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి